25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణముత్యాల పోచమ్మలకు ఘనంగా బోనాలు.

ముత్యాల పోచమ్మలకు ఘనంగా బోనాలు.

ముత్యాల పోచమ్మలకు ఘనంగా బోనాలు.

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట పట్టణంలోని స్థానిక కేసీఆర్ నగర్ గుండ్ల చెరువు డబల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో మైసమ్మ ముత్యాల పోచమ్మ దేవాలయంలో గురువారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, స్థానిక కౌన్సిలర్ నాయిని చంద్రం, మెడికల్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, మాజీ కౌన్సిలర్ బండారు నర్సింలు పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బిఅర్ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు మాట్లాడుతూ ఆషాడ మాసం అంటేనే తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉందని డప్పు చప్పుల్లతో పోతరాజుల నాట్య విన్యాసాలతో ఆడపడుచులు మహిళలు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పిస్తారని కార్యక్రమంలో చిన్న పెద్ద అందరూ పాల్గొని గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలిచి తమ పిల్లా పాపలను పాడి పంటలను చల్లగా కాపాడాలని ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవించేలా చూడాలని కోరుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మైసమ్మ, ముత్యాల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు గట్టయ్య,వీరేశం, జెల్ల పద్మ,పద్మశ్రీ రెడ్డి,సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, భవాని, లక్ష్మి, మంజుల, పద్మ, భిక్షపతి, కనకయ్య, యాకయ్య, నాగరాజు, నరేష్, గణేష్, తిరుపతి, ఆస్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్