మెదక్ లో కాంగ్రెస్ జెండా ఖాయం
మెదక్ యదార్థవాది ప్రతినిది
తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ హవా జోరుగా సాగుతుందని మెదక్ లో మా అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని కర్ణాటక ఎమ్మెల్సీ మెదక్ పార్లమెంట్ అబ్జర్వర్ పరిశీలకులు యూపీ వెంకటేష్ అన్నారు. ఈసందర్భంగా మెదక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంమే అని ఇటీవల సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం పట్ల మెదక్ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్యాక్టరీల నుండి వేల కోట్ల రూపాయల దోచుకుంటున్నారని, మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో శూన్యమని మెదక్ లో మార్పు కావాలని కాంగ్రెస్ రావాలని అవినీతి రాజ్యం పోవాలని ప్రజలు విశ్వాసంతో చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారని కాంగ్రెస్ 75 సీట్లతో అధికారంలోకి రాబోతుందని జీమ వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆరు పథకాలు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ పథకాలు ఇస్తామని వెల్లడించారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాలలో మా అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి రాజపత్రం అందుకుంటారని టిఆర్ఎస్ అభ్యర్థి ఏం పద్మ దేవేందర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఉద్యోగుల ఓటు వేయకుండా కావాలని ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను అడ్డుకుంటుందని బ్యాలెట్ పోస్టుల కోసం ఓట్లు వేయడానికి వస్తే బ్యాలెట్ పోస్టులను పంపిణీ చేయలేదని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగస్తులను వాడుకుంటుందని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ జీవన్ రావు శ్రీనివాస్ గూడూరు ఆంజనేయులు గౌడ్ అవారి శేఖర్ రాజలింగం అనిల్ కుమార్ బొజ్జ పవన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.