మెదక్ లో డ్రగ్స్ ముఠా తిరుగుతోందా.!
మత్తులో ఊగుతున్న యువత.!
పట్టి పట్టనట్టు పోలీస్ అధికారుల వైనం.!
మెదక్ యదార్థవాది ప్రతినిధి
నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ జిల్లాలో యువతను మత్తులో ముంచడానికి కొన్ని ముఠాలు జిల్లాలో తిరుగుతున్నట్లు సమాచారం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలను రాష్ట్రంలో నిర్మూలించడానికి శాయశక్తులు కృషి చేస్తున్న అక్కడక్కడ కొన్ని ముఠా సభ్యులు నీరు గారుస్తున్నరు..
ఇందుకు నిదర్శనం ఇటీవల మెదక్ పట్టణంలో సుమారు పది నుండి పదిహేను కిలోల వరకు నిషేధిత అల్పజోలం డ్రగ్ పట్టు పడ్డట్లు తెలుస్తోంది. ఏమైనా కానీ ఇప్పటికైనా అధికారులు డ్రగ్స్ రహిత జిల్లాగా చూడాలని మెదక్ జిల్లాలో ప్రతి ఒక్కరి ఆశ..