మేకపై చిరుత దాడి అనేది కట్టుకథ
-సంఘటన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు
లేవు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్
యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 25 : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మాయాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతం లో గుట్ట వద్ద గొర్రెల మందపై పులి పిల్ల దాడి చేసి మేక పిల్లను గాయపరిచిందని గ్రామానికి చెందిన గొర్ల కాపరి జింకల పోతన్న తెలిపారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామ శివారులో గల గుట్ట వద్ద పులి తన గొర్ల మందపై దాడి చేసిందని ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో గుట్టపై పులి అడుగుజాడల ఆన వాళ్లను వెతుకగా ఎక్కడ కూడా పులి ఆడవాళ్లు కనిపించలేదని తెలిపారు. మేకపై దాడి చేసింది వేరే జంతువు అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇకపైనుండి గొర్ల కాపరులు తమ గొర్లను అటవీ ప్రాంతంలోకి మేపడానికి తీసుకువెళ్లద్దని హెచ్చరించారు. అలాగే రైతుల కూడా తమ పంట పొలాల వద్ద పంటను రక్షించేందుకు విద్యుత్ తీగలను అమర్చవద్దని వాటి ద్వారా అడవి జంతువులు విద్యుత్ షాక్ తో మృతిచెందితే రైతుల పైన అటవిశాఖ యాక్ట్ కింద చర్యలు చేపడతామని తెలిపారు.