యువతకు,విద్యార్థులకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు

316

యువతకు,విద్యార్థులకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు

అధికారం కోసం వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అప్పుడప్పుడు బంపర్ ఆఫర్ లు ఇస్తాయి. మద్యం, డబ్బులు పంచితే… మరికొందరు వరాల జల్లు కురిపిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృశ్య కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తాజాగా యువతను, విద్యార్థులకు వరాలను కురిపించే విధంగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంటర్ పాసైన బాలికలకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్లు, డిగ్రీ విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి