రఘురామ ఇంటిపై దాడికి వైసీపీ స్కెచ్ : ఆంధ్ర తాజా తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు

489

రఘురామ ఇంటిపై దాడికి వైసీపీ స్కెచ్ : ఆంధ్ర తాజా తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్ర తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుమానం కలుగుతుంది. టిడిపి ఆఫీస్ లో, ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడులు జరిగినట్లే భీమవరం లోని తన ఇంటిపై కూడా దాడులు దాడులు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ కార్యకర్తలకు సమాచారం వచ్చిందని తన వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని తాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానాని బిజెపి కి లేఖ రాశానని వెల్లడించారు. మంగళగిరిలో కాబట్టి దాడులతో ఊరుకున్నామని అదే రాయలసీమలో అయితే పరిస్థితి హత్యల వరకు వెళ్లలేదని వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా సీఎం జగన్ పై కేసు విచారణ వేగవంతం చేయాలంటూ రఘు రామ తాజాగా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఢిల్లీలో లో మీ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. జగన్ పై ఉన్న కేసుల విచారణ తొందరగా జరిగితే మంచిదంటూ రఘు రామ వ్యాఖ్యానించారు. జగన్ పై కేసులు విచారణ తొందరగా పూర్తయితే ఆయన్ని ఎవరు వేలెత్తి చూపే అవకాశం ఉండదని, కింది కోర్టులో పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేయదన్న నమ్మకం ఉందన్నారు. తాను గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పెట్టిన పిటిషన్ల తో తాజా పిటిషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి