రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.
-పొన్నంను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే రెండు సార్లు ఓడించారు..
-హుస్నాబాద్ ప్రజలు కూడ ముచ్చటగా మూడోసారి పొన్నం ప్రభాకర్ తిరస్కరిస్తారు..
-దండుగుల రాజ్యలక్ష్మి..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
ఎన్నికలలో రాజకీయాలే తప్ప వ్యక్తిగత దూషణలు ఉండకూడదని నేషనల్ లేబర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం బిఅర్ఎస్ నాయకులతో కలసి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం లో ఫెడరేషన్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజాక్షేత్రం లో మీరు చేసే పనులు చెప్పుకొని ఓట్లు అడగాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని అన్నారు. ప్రజలకు మేలు చేస్తే కరీంనగర్లో రెండుసార్లు ఎందుకు ఓడిపోయారు. ఇప్పుడు నియోజకవర్గ మారినంత మాత్రాన ప్రజలు మీకు పట్టం కడతారని అనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేసినవని హుస్నాబాద్ కు వచ్చినవ్ అని ప్రశ్నించారు ఓటర్ కార్డు మార్చినంత మాత్రాన ఓటర్ మనస్సును మార్చలేవు డిల్లీ ప్రజలకు గులాం చెయ్యడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసిఆర్ అవుతారని హుస్నాబాద్ లో మూడవసారి బిఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ గెలవడం తధ్యమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి మానస, మండల అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్శరాము, చౌటపల్లి సర్పంచ్ గద్దాల రమేష్, రజిత, మాలపల్లి సర్పంచ్ బత్తుల మల్లయ్య, మాజీ మార్కెట్ ఛైర్మెన్ లింగాల సాయాన్న,మాజీ జడ్పీటిసి బిల్ నాయక్ ,మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్ ,ప్రభాకర్ రెడ్డి, రామచంద్రం, వెంకట స్వామి, నాయకులు జనార్ధన్, ప్రేమ్ కుమార్, రవి తదతరులు పాల్గొన్నారు.