రాజన్న ప్రీమియం లీగ్ 2023 లోగో ఆవిష్కరన..
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
“రాజన్న ప్రీమియం లీగ్ 2023” వాలీబాల్ మరియు కబడ్డీ పోటీల లోగో ఆవిష్కరించిన మంత్రి కే తారక రామారావు.. జిల్లాలో గ్రామీణ యువతీ యువకులను క్రీడలలో ప్రోత్సహించడానికి సోమవారం మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా “రాజన్న ప్రీమియం లీగ్ 2023” వాలీబాల్ మరియు కబడ్డీ పోటీల లోగో, షెడ్యూల్ ను వీర్నపల్లి మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ,
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఉపేందర్ రావు లు పాల్గొన్నారు .