తెలంగాణలో లో రాజన్న పాలన వస్తేనే అందరి బ్రతుకులు బాగుపడతాయని వైయస్సార్ టి పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేవరకొండ నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న ఆమె రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీయడమే తన లక్ష్యం అన్నారు. వైఎస్ హయాంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదని గుర్తు చేశారు. కెసిఆర్ కు బుల్లెట్ ప్రూఫ్ ఇండ్లు పేదలకు మట్టి ఇండ్ల అని ప్రశ్నించారు.