20.7 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణరైతన్నలను సాగునీరు అందించాలి: మడుపు భూంరెడ్డి

రైతన్నలను సాగునీరు అందించాలి: మడుపు భూంరెడ్డి

రైతన్నలను సాగునీరు అందించాలి: మడుపు భూంరెడ్డి

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి 

తపస్ పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలంలోని రైతులకు నిరంధించాలని తెలంగాణ హోసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూం రెడ్డి అన్నారు. బుదవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలో నేడు ఇంకా వరి నాట్లు పూర్తి కాకముందే  చెరువుల్లో నీరు సగానికి పైగా ఇంకిపోవవంతో బయపడిన రైతులు భూం రెడ్డిని కలిసి పరిస్థితులు వివరించగా రైతులను వెంటబెట్టుకుని తిమ్మారెడ్డిపల్లి వద్ద తపాస్ పల్లి డీ 4 కెనాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యాసంగి పంట చేతికి రావాలంటే వెంటనే  కాల్వలు మరమ్మతులు చేసి చెరువులు నింపాలని, దేశానికి రైతు వెన్నుముక కాబట్టి రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేలా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన తపాస్ పల్లి రిజర్వాయర్ నుండి  కొండపాక మండలం లోని పదకొండు గ్రామాలకు డీ 4 కెనాల్ ద్వారా సాగు నీరంధించేందుకు గాను 2011 సంవత్సరం లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కొమురవెల్లి మండలం ఐనాపూర్ కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి మీదుగా కెనాల్ నిర్మించిన విషయం తెలిసిందే. రాష్ట విభజన తరువాత 2014 లో గెలిచిన బీఆరెస్ ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలిచిందని సాగు నీరు అందించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు అహర్నిశలు కస్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని మరో కొనసీమగా మర్చరని భూంరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భూంరెడ్డి తో పాటు వెలికట్ట గ్రామ మాజీ సర్పంచ్ గొడుగు యాదగిరి సిరసనగాండ్ల  బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లికార్జున్ మర్పడ్గ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య తిమ్మారెడ్డిపల్లి ఆత్మ కమిటీ డైరెక్టర్ సున్నం భాస్కర్ వార్డ్ సభ్యులు కనకసేన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల  రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్