19.7 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణరైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం

రైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం

రైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పిసిసి సభ్యులు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని, రైతులకు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నట్లు మాయమాటలు చెబుతున్నారని, కానీ రైతులకు విద్యుత్ ను అందచేయడం లేదని, రైతులు వేసిన పంటలకు నీరందకపోవడంతో ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాణ్యమైన త్రీఫేస్ విద్యుత్ ను సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని తెలిపారు.అధికారంలో ఉందనే అహంకారంతో రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని మండపడ్డారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడోద్దని సూచించారు. ఈ దర్నలో బొమ్మల యాదగిరి, అత్తు ఇమామ్, సూర్య వర్మ, ముద్దం లక్ష్మి, దేవులపల్లి యాదగిరి, కలిముద్దీన్, మార్క సతీష్, తప్పేట శంకర్, బిక్షపతి, వంగరి నాగరాజు అనిల్ మున్నా అజ్జు యాదవ్ గయాజుద్దీన్ హస్నుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్