రోడ్ షోలు బంద్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
ఇకనుండి నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే రోడ్ షో..
రోడ్లపై పోలీస్ యాక్ట్ 1861 అమలు..
రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోమ్ శాఖ ఉత్తర్వులు..
ఆంధ్ర రాష్ట్రం లో రోడ్లపై నిషేధ విధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై పొలిటికల్ షోలు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీచేశారు. 1861 సెక్షన్ పోలీస్ యాక్ట్, ఇకపై 13 సెక్షన్ కూడ అమలు చేస్తారు.. ప్రజలకు ఇబ్బంది లేని రోడ్లకు దూరంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని, అత్యంత అరదైన సందర్భంల్లో షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రత్యామ్నయ ప్రదేశాలు ఎంపిక చేసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవు..