26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
హోమ్జాతీయలక్ష్యం నెరవేరిందా..! బ్లాక్ మనీ వెలికి తీశారా...?

లక్ష్యం నెరవేరిందా..! బ్లాక్ మనీ వెలికి తీశారా…?

– నోట్ల రద్దు నేటికీ ఐదు సంవత్సరాలు
– మద్దతు చలామణి తగ్గిందా
– బ్లాక్ మనీ వెలికి తీశారా
ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం తో వందకోట్ల మంది జనం మరిచిపోలేదు. 5 సంవత్సరాల క్రితం నవంబర్ 8వ తేదీనాడు డిమనిటైజేశన్. బ్లాక్ మనీ అరికట్టడానికి, నగదు చలామణీ తగ్గించడానికి అని ప్రభుత్వం చెప్పింది. దీర్ఘకాలిక ఫలితాలు ఇలా ఉంటాయని అని చెప్పి ఇప్పటికీ ఐదేళ్లు అయింది.
మరి డిమనిటైజేశన్ కనిపిస్తుందా..? వందకోట్ల ప్రజలు అనుభవిస్తున్నారా..?

పెద్ద నోట్లు వద్దు చేసిన రోజు రూ. 1000, 500 నోట్ల రూపంలో ఉన్న పెద్దలు దోచుకున్నారని.. వాటినన్నిటిని వెలికితీస్తామని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులో జమ చేశారు. బ్లాక్ మనీ లెక్క తేలుతుందని ప్రభుత్వం భావించింది. సుప్రీంకోర్టులో విచారణలో రూపాయలు మూడు లక్షల కోట్ల వరకు బ్లాక్ మనీ ఉంటుందని అవి బ్యాంకు రావని చెప్పారు. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని లెక్కలు చెప్పారు. కానీ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం రూ. 15 లక్షల 41వేల కోట్లు, బ్యాంకులకు తిరిగి వచ్చింది రూ. 15 లక్షల 31వేల కోట్లు. అంటే.. సుమారు 99.3 శాతం వచ్చాయి. నల్లధనం పై ఇప్పటికీ స్పష్టత లేదు. బ్యాంకులో డిపాజిట్ అయినా అదంతా బద్ధమైన డబ్బులు కాదని అందులో నల్లధనం ఉంది.. పట్టుకుంటామని అని కేంద్రం ప్రకటించి. కానీ ఇప్పటికీ ఐదేళ్లు గడిచినా నల్లధనం ఎంత అనే దానిపై స్పష్టత రాలేదు. ఎవరిని పట్టుకున్నారు.. ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు.. ఫలానా వాళ్ళు బ్లాక్ మనీ డిపాజిట్ చేశారు అని గుర్తించారు.. అన్న అంశాలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. మనదేశంలో బ్లాక్ మనీ లేదని ఎవరు కూడా నమ్మరు.. నేటికీ లెక్కలు లేకుండా లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు లెక్కలు లేకుండా కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. అంటే బ్లాక్ మనీ అధికారికంగా వైట్ మనీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నగదు చలామణీ ఉండడం వల్ల నల్లధనం పెరిగిందని. అందుకే నగదు చలామణి తగ్గించడానికి నోట్ల రద్దు చేశామని తెలిసింది. నిజానికి ఏమాత్రం ప్రజల నగతు చలామణి ఐదేళ్లలో ఏమాత్రం తగ్గలేదు సరి కదా.. 50 శాతం పెరిగింది. నవంబర్ 4 2016న రూ. 17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద రూపాయలు, అక్టోబర్ 8 20 21 నాటికి రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది ఈ లెక్కన చూస్తే ఏకంగా 57 పాయింట్ 48 శాతం గా ఉంది. అంటే నోట్ల రద్దు ముందు కన్నా ఇప్పుడే ఎక్కువ నోట్లు చలామణి అవుతున్నాయి. నగదు చలామణీ తగ్గిస్తామని నోటు రద్దు చేస్తే అది కాస్త.. ఇవాళ ఎక్కువైంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్