వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందిన ఘటన కలిచివేసింది.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో శుక్రవారం వాగులో కొట్టుకుపోయి మరణించిన ఏడెల్లి రాజయ్య భౌతిక కాయాన్ని శనివారం పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవాబుపేట గ్రామంలో నిన్న వాగులో వ్యక్తి గల్లంతయిన విషయం తెలుసుకొని హుటాహుటిన అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారు, ఎమ్మెల్యే కూడా స్వయంగా వెళ్లి పరిశీలించారు.. అయినా ఫలితం లేకపోయిందని ఆ దుర్ఘటనలో రాజయ్య మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో కొమ్మరి శ్రీరామ్ రెడ్డి ఇటీవల మృతి చెందిగా వారి కుటుంబసభ్యులను హుస్నాబాద్ మండలం రాములపల్లి గ్రామంలో సర్పంచ్ మధు రెడ్డి తల్లి గంగం వెంకట నర్సవ్వ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, అక్కన్నపేట జడ్పిటిసి భూక్యమంగ, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మాజీ జెడ్పిటిసి బీలు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, చిగురుమామిడి మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, రైతు స స అధ్యక్షులు పెనుకుల తిరుపతి, నవాబుపేట సర్పంచ్ సుద్దాల ప్రవీణ్, ఎంపీటీసీ మంకు స్వప్న తదితరులు పాల్గొన్నారు.