30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణవిద్యార్థి లక్ష్యంతో చదవాలి..

విద్యార్థి లక్ష్యంతో చదవాలి..

విద్యార్థి లక్ష్యంతో చదవాలి..

యదార్థవాది ప్రతినిది దుబ్బాక

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి తమ నాలెడ్జి వేలికితియాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు పరీక్ష పే చర్చ అనే కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడారు… విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించాలని అన్నారు. లక్ష్యంతో చదివినట్లయితే దేశానికి, తమ తల్లిదండ్రులకు గొప్ప పేరు వస్తుందని అన్నారు. పురాతమైన భాష హిందీ అని, హిందీ భాషా ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చేలా భాషా పండితులు బోధించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. నేటి విద్యర్దులే రేపటి భావి భారత పౌరులని, పరీక్షలు అంటే భయాందోళన చెందకుండా ఉండేందుకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారని అన్నారు. వివిధ పాఠశాల ఉపాధ్యాయులు కూడ పరీక్ష పే చర్చ సంబంధించిన వివరాలను తమ తమ పాఠశాలలో విద్యార్థులకు తెలుగులో వర్ణించి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చింత సంతోష్ గుప్తా, బాలేష్ గౌడ్, సుంకు ప్రవీణ్, ఎస్ ఎన్ చారి, అనిల్ రెడ్డి, దూలం వెంకటేష్, నిహాల్ గౌడ్, రమేష్ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్