వినూత్న ప్రచారనికి శ్రీకారం చుట్టిన నాయి బ్రాహ్మణులు
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా వినూత్న ప్రచారం నిర్వహించారు. సెల్లో షాపులలో కటింగ్ షేవింగ్ చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి చింతా ప్రభాకర్ ను గెలిపియాలని షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించారు. శుక్రవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు లక్డారం మాణిక్ ప్రభు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా రెండు, మూడు రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ బిసి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మా మద్దతుగా గెలుపు కోసం ప్రచారం కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు లక్డారం మాణిక్ ప్రభు మాట్లాడుతూ మా నాయి బ్రాహ్మణులను మేలుకొలుపుతో ఉదయం షాప్ టు షాప్ తిరిగి, అలాగే సాయంత్రం మా కులస్తుల కుటుంబాలకు ఇంటిటికి తిరిగి అవగాహన కల్పిస్తూ బ్యాలెట్ లో రెండవ గుర్తు అయిన కారు గుర్తుపై ఓటు వేసి చింతా ప్రభాకర్ ను భారీ మెజారిటీతో గెలిపియాలని పిలుపునిచ్చారు. మా మద్దతు చింతా ప్రభాకర్ కు ఎల్లవేళలా ఉండాలని అసెంబ్లీలో మా గొంతుక వినిపించాలని, నాయి బ్రాహ్మణులను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఆయన మా తరుపున కొట్లాడి, మేలు చేయాలని దృఢసంకల్పం ఉన్నారని, మా నాయి బ్రాహ్మణులకు రాజకీయ పరంగా ఇప్పటి వరకు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఇతర నామినేటెడ్ పోస్టులు రావాలంటే చింతా ప్రభాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయి బ్రాహ్మణులకు జిల్లా కేంద్రంలో కమిటీ హాల్ కు స్థలం కేటాయిస్తూ నిధులు రావాలంటే మా నాయిలందరినీ అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతున్నామని కారు గుర్తుకు ఓటు వేసి చింతా ప్రభాకర్ ను గెలిపించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిసి బంధు డబల్ బెడ్ రూమ్ గృహలక్ష్మి ఇళ్ల స్థలాలు అర్హులైన నాయులకు అందే విధంగా చింతా ప్రభాకర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కనీసం గుర్తించిన దాఖలలో లేవన్నారు. చింతా ప్రభాకర్ గెలిచిన తర్వాత మా వంతు సహకారంతో మా నాయి బ్రాహ్మణుల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ఆ నమ్మకంతో మేము చింతా ప్రభాకర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ నాగభూషణం నాయి వీరన్న నాయి అంజన్న నాయి మురారి నాయి గోపాల్ నాయి చరణ్ నాయి సత్తయ్య నాయి శ్రీశైలం నాయి రాము నాయి చెర్యాల ఆంజనేయులు నాయి చీమలదరి శేఖర్ నాయి తదితరులు పాల్గొన్నారు.