హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో సోమవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి నుండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకుంది. సయ్యద్ అలీ అనే ప్రయాణికుడు వద్ద సుమారు 12 లక్షల 87 వేలు విదేశీ కరెన్సీ రియల్స్ ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.