వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్…

332

వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్…

హైదరాబాదు 29 డిసంబర్

ముఖ్యమంత్రి వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి