వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన..కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

278

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన..కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట 27 డిసెంబర్

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం-వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్…

సిద్దిపేట రూరల్ మండలం ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. సిద్దిపేట రీజనల్ రింగ్ రోడ్డు విశ్వవిద్యాలయంకు కేటాయుంచిన భూమిలో నుండి వెళ్తుందని,రింగ్ రోడ్డు వల్ల కళాశాలకు కేటాయుంచిన భూమి నష్టం చేకూరుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్&బి ఇంజనీరింగ్ అధికారులు ఎస్ఆర్ఆర్ వెళ్తున్న క్రమాన్ని మ్యాప్ ద్వారా కలెక్టర్ కు తెలిపారు. ఎస్ఆర్ఆర్ మార్గాన్ని విశ్వవిద్యాలయ పాలిటెక్నీక్ కళాశాల మద్యలో ఉండడం వల్ల ఇబ్బంది ఉందని, మద్య నుండి కాకుండా, చివర్నుండి వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రణాళికలు రూపోందించాలని ఆర్ & బి ఇంజనీర్ అధికారులకు, రూరల్ తహసీల్దార్, సర్వేయర్ సూచించారు. ఇలా చేయడం వల్ల ఎవ్వరికీ నష్టం,ఉండకుండా త్వరగా వెరిఫై చెయ్యాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్&బి ఈఈ సుదర్శన్ రెడ్డి, డిఈ బాల ప్రసాద్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి