శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్
-రియల్ ఎస్టేట్ వ్యాపారి పై పీడీ యాక్ట్ నమోదు
-శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు
మంచిర్యాల యదార్థవాది
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసి, బెదిరింపులకు పాల్పడుతున్న మామిడి శ్రీనివాస్ పై సోమవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసిన పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి.. మామిడి శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ క్రూరమైన హత్య, నేరపూరిత బెదిరింపులకు, నేరాలకు పాల్పడటంతో ఇక్కడి ప్రాంతంలో నివసించే సాధారణ ప్రజల తీవ్ర భయాందోళనలు సృష్టించడం తద్వారా చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం సామాజిక శాంతి సామరస్యతలకు భంగం కల్పించడంతో రామగుండం కమిషనరేట్ పరిధిలో శాంతి సామరస్యాలపై ప్రతికూల ప్రభావం కలిగించిన్నాయని, ఈ క్రమంలో నడిపెల్లి లక్ష్మి కాంతారావు హత్య, ఇంకా కొంతమందిని బెదిరింపులకు పాలపడుతున్నాడని నిందితునిపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి నిందితుడిని చర్లపల్లి జైలు తరలించినట్లు కమిషర్ తెలిపారు. నేరస్తుని పై పీడీ యాక్ట్ అమలు చేయుటకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మందమర్రి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, రామకృష్ణ పూర్ ఎస్ఐ అశోక్ లను కమిషనర్ అభినదించారు..