సమాజంలో బాలల హక్కులు వినియోగించు కోవాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరసిల్ల: యదార్థవాది ప్రతినిది
మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు ప్రజలలో అవగాహన పెంచడానికి, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, లైంగిక హింస, అక్రమ రవాణా మొదలగు వాటి గురించి బాల బాలికలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక మహిళా, శిశు సంక్షేమ పథకాల వివరించడం జరిగిందని, చిన్నపిల్లలు ఆపదలలో ఉంటే 1098, సేవలు ఉపయోగించుకోవాలని తెలపడం జరిగిందని కలెక్టర్ వివరించారు..ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం, సంక్షేమ సమితి చైర్మన్ కమటం అంజయ్యల జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్ స్వర్నలత పాల్గొన్నారు.