సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణ
-బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు.
-హుస్నాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్.
-రాష్ట్ర హోం మంత్రి మెహముద్ అలీ.
యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిది
హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మెహముద్ అలీ స్ధానిక ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ ను హుస్నాబాద్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ లు అందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మైనార్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు మైనారిటీ గురుకుల పాఠశాలలు షాదీ ముబారక్ విదేశాలకు వెళ్లాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ పథకం మైనారిటీ రిజర్వేషన్లు ద్వారా మైనారిటీలు అభివృద్ధి చెందుతున్నారని కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ బిజెపి పార్టీలు మైనార్టీలకు చేసింది ఏమీ లేదని మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మైనార్టీలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ రెండు పర్యాయాలు వేలకోట్లతో అభివృద్ధి చేశారు మూడోసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి కేసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిందని వారి తండ్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సైనికుడిగా రాజకీయ నాయకునిగా మానవతావాదిగా ప్రజలకు సేవ చేశారని ఆయన ఆశలకు అనుగుణంగా వారసునిగా సతీష్ కుమార్ మచ్చలేని నాయకుడు ప్రజాసేవకు అంకితమైన వాడు ఆయనను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ముస్లింల షాదీ ఖానా కోసం రెండు కోట్లు కేటాయించానని నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలకు అవసరమైన నిధులు అందించానని సతీష్ కుమార్ తెలిపారు.