23.2 C
Hyderabad
Saturday, February 8, 2025
హోమ్తెలంగాణసావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి వేడుకలు..

సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి వేడుకలు..

సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి వేడుకలు..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం చదువులతల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల హక్కుల కోసం పోరాటం చేసి తమ సామాజిక బాధ్యతగా నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి భర్త జ్యోతిబా పూలే తో కలిసి సమష్టిగా పోరాటం చేసిన మహానియురాలని పలువురు నాయకులు కొనియాడారు.. పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ ఆమె కేవలం జ్యోతి బా పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారు.ఆమె చేసిన సేవలు నేటి మహిళలు, యువత చాలా మందికిఆదర్శం,స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆనాటి దేశ పరిస్థితి 1896వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి దేశమంతటా వ్యాపించి లక్షలమందిని పొట్టన పెట్టుకున్నదని ప్లేగు వ్యాధి సోకిన బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేస్తూ చివరికి అదే ప్లేగు అంటువ్యాది సోకి సరిగ్గా ఇదే రోజున చిపోయిందని తెలిపారు. కార్యక్రమంలో వేల్పుల శంకర్ మంద మల్లేశం గోవింద్ సురేష్ మంద ధర్మయ్య బందెల కిషన్ తేలు యాదగిరి ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్