27.7 C
Hyderabad
Sunday, April 14, 2024
హోమ్జాతీయసికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ను తనిఖీ చేసిన..రైల్వే శాఖ సహాయ మంత్రి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ను తనిఖీ చేసిన..రైల్వే శాఖ సహాయ మంత్రి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ను తనిఖీ చేసిన..రైల్వే శాఖ సహాయ మంత్రి

సికింద్రాబాద్ 28 డిసంబర్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ది ప్రణాళికలను కేంద్ర రైల్వే శాఖ సహాయ, జౌళి శాఖ మంత్రి దర్శన జర్దోష్ బుదవారం తనిఖీ చేసారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్దికి సంబందించిన ప్రణాళిక, ప్రాజెక్ట్‌పై పురోగతిపై మంత్రి సమీక్షించారు. రైల్ స్టేషన్ ను వచ్చే,రాబోయే 40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అవసరాలకు అనుగుణంగా పనులను చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో గౌరవ మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జంట నగరాల్లో ప్రధాన రవాణా కేంద్రంగా ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలతో పునరాభివృద్ధికి ఈ స్టేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. షెడ్యూల్,నిర్దేశించిన కాలపరిమితి ప్రకారం పునర్నిర్మాణ పనులను మూడేళ్లలోపు పూర్తి చేస్తామన్నారు. మంత్రి టి. సి ఏ .ఎస్ (ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా డీ కొనకుండా ప్రమాదాన్ని నియంత్రించే వ్యవస్థ ) ను దేశీయంగా దక్షిణ మధ్య రైల్వే లో ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి పర్చేందుకు ఇది భారతీయ రైల్వే అంతటా పెద్ద ఎత్తున అమలు చేయబడుతుందని మంత్రి తెలిపారు. 700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నట్టు, పర్యావరణహితంగా, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ ప్రాజెక్టు పనులు చేపడుతునందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆమె అభినందించారు. వందే భారత్ సేవలను దేశమంతటా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, అదనపు జనరల్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే అమిత్ గోయెల్ మరియు అన్ని శాఖల ముఖ్య శాఖా ప్రధానాధికరి హాజరయ్యారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్