సీఎస్సీ కేంద్రాలతో యువతకు ఉపాధి
యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి
ఉన్నత చదువులు చదివిన యువత నిరుద్యోగ సమస్య నిర్మూలన వైపు మొగ్గు చూపాలని బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.. పలిమెల మండలం బూర్గుగూడెంలో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఆధ్వర్యంలో డిజిటల్ విలేజ్‌లో బాగంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాన్ని ప్రారంభించిన మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మారుమూల గ్రామాలను డిజిటల్ విలేజ్‌గా ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని, గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎస్సీ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇంటి దగ్గరే ఆర్థిక లావాదేవిలు, రెవెన్యూ పరమైన అంశాలు, బ్యాంకు అకౌంట్‌లు, ఇతరత్రా సేవలను ఈ కేంద్రాల ద్వారా వినియోగించుకోవలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా వంద డిజిటల్ విలేజ్‌లుగా మార్చేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ శ్రీకారం చుట్టిందని, అందులో నియోజకవర్గంలోని బూర్గుగూడెం ఎంపిక అయిందన్నారు. మన ఊరికి చెందిన సర్వేష్ అనే యువకుడు వివిధ సేవలు అందిస్తాడని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో వంద డిజిటల్ విలేజ్‌లను త్వరగా ఏర్పాటు చేసి దేశంలో ఆదర్శంగా నిలుపాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని పేదవర్గాలకు పెద్ద ఎత్తున ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందిపుచ్చుకునే అంశంలో తమవంతు పూర్తి సహకారం ఉంటుందని, సీఎస్సీ కేంద్రం ఏర్పాటు చేసిన సర్వేష్ ఈ ప్రాంతంలోని నిరుపేదలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు..