38.2 C
Hyderabad
Friday, April 19, 2024
హోమ్తెలంగాణసెస్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్

సెస్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్

సెస్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్

వేములవాడ, 22 డిసెంబర్, 2022

ఈ నెల 24 న జిల్లా వ్యాప్తంగా జరగనున్న సెస్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తో కలిసి వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెస్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 252 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, శుక్రవారం ఉదయం 8 గంటల నుండి బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుందని తెలిపారు. మొదటగా ఎవరికి ఏ బూత్ కేటాయించారో తెలపడానికి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారని, బూత్ స్థాయిలో మొత్తంగా 750 మంది సిబ్బందిని కేటాయించడం జరిగిందని, వీరితో పాటు ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా ఉంటారని అన్నారు. బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కోసం 40 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 26 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఇదే కళాశాలలో ఉంటుందని, ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిఘా నేత్రాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ లు ఈ కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్శనలో ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి బుద్ధనాయుడు, సెస్ ఎండీ రామకృష్ణ, తహశీల్దార్ రాజు, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్