సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు..

240

సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు..

సిద్దిపేట 30 డిసెంబర్

* బాల వికాస ఆధ్వర్యంలో సేంద్రీయ రైతుల మార్కెట్..

* దేశ జనాభాకు తగ్గట్టు వ్యవసాయం చేయాలి..

సిద్ధిపేట జిల్లా కేంద్రం ఉన్నత విద్యపాఠశాలలో బాల వికాస ఆధ్వర్యంలో సేంద్రీయ రైతుల మెగా మార్కెట్ మేళాను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ లతో కలిసి ప్రారంభించారు. దేశ జనాభా అవసరాలకు సరిపోవు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రసాయనిక ఎరువులు ఆధునిక విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం విఫలమైందనిరాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రపంచమంతా భూసార సంరక్షణ, టెర్రరిజం నిర్మూలన, పర్యావరణ, రక్షణకు కృషి చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుల మతాల చిచ్చు పెట్టిందని మంత్రి అన్నారు.భూసార పరీక్షలు జరపాలని అవసరమైతే తప్ప మందుల వాడకం చేయాలి, సేంద్రియ పద్దతిలో రైతులు సాగుచేయాలి. ప్రపంచానికి ఆహార పదార్థాలను ఒక్క భారతదేశం మాత్రమే సప్లై చేయగలదని, కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడంలేదని అన్నారు. చిన్న ప్రయత్నం తో ప్రారంభమై ఆచరిస్తే చరిత్రలో నిలిచిపోయే నాయకుడు హరీష్ రావు అన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి