హత్యకు పాల్పడిన నిందితులను 24గంటల్లో పట్టుకుంటాం..

271

హత్యకు పాల్పడిన నిందితులను 24గంటల్లో పట్టుకుంటాం..

సిద్దిపేట 26 డిసెంబర్ 22

జిల్లాలో కాలకం సుష్టించిన చేర్యాల జడ్పిటిసి శెట్టి మల్లేశం హత్య.. సోమవారం మండలం చేర్యాల, గుర్జకుంట క్రాస్ రోడ్డు వరకు మార్నింగ్ వాక్ వెళ్ళుతుండగా మార్గమధ్యలో సుమారు 6 నుండి 6:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. తలకు బలమైన గాయం కావడంతో, చికిత్స నిమ్మితం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రధమ చికిత్స అనంతరం, హైదరాబాద్ రెఫర్ చేయరు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శెట్టి మల్లేశం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత శెట్టి మల్లేశం ను హత్య చేసిన నిందితుల గురించి ప్రత్యేకంగా హుస్నాబాద్ ఎసిపి సతీష్, చేర్యాల సిఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి లతో ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేశామని, 24 గంటల లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను తెలియపరుస్తామని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి