15.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణహరితోత్సవంతో పల్లెలలో కొత్త శోభ నింపిన ఘనత కేసీఆర్ : ఎమ్మెల్యే సతీష్ బాబు

హరితోత్సవంతో పల్లెలలో కొత్త శోభ నింపిన ఘనత కేసీఆర్ : ఎమ్మెల్యే సతీష్ బాబు

హరితోత్సవంతో పల్లెలలో కొత్త శోభ నింపిన ఘనత కేసీఆర్ : ఎమ్మెల్యే సతీష్ బాబు

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి

వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ బాబు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో సోమవారం కోహెడ మండలం నూతనంగా ఏర్పాటు జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిప్పారపు జ్యోతి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు లింగారెడ్డి, రాజేశ్వరరావు, తిరుపతి, శ్రీనివాస్, రవి, రజిత, వెంకటరెడ్డి, అంజయ్య, తిరుపతిరెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, దొంగల తిరుపతిరెడ్డి, ముంజ సంపత్ లను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో మార్కెట్ కమిటీ సేవలను అందించాలి ఇందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. నేడు మనకు అందుతున్న ఫలాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసినా ఉద్యమంతోనే అందుతున్నాయని, పల్లెలు పట్టణాలు హరిత విప్లవంతో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని దీంతో చెరువులు కుంటలు నిండుకుండలా తలపిస్తున్నాయి రైతులలో సంతోషం వెల్లివిరిసిందని ఇందుకు మనము ముఖ్యమంత్రికి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం మార్కెట్ యార్డ్ సిద్దిపేట మార్కెట్ యార్డ్ కంటే మెరుగైన పనితీరుతో ముందు వరుసలో ఉందని కోహెడ మండలంలో గతంలో మహా అయితే లక్ష క్వింటాళ్ల ధాన్యం కూడా రాలేదని నేడు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పైనే ధాన్యం వస్తుంది రైతులు పండించిన పంట కోసి మార్కెట్ యార్డ్ లో తూకమైన వారం రోజుల్లోనే నేరుగా రైతు అకౌంట్లోకి టంగ్ టంగ్ అంటూ ధాన్యం డబ్బులు అకౌంట్ లో పడ్డటువంటి మెసేజ్లు రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని, త్వరలోనే గౌరవెల్లిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి కాలువల ద్వారా నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చేస్తామని ఇప్పటికే కోహెడ మండలంలో నీటికి కొరత లేదని తెలంగాణలో ప్రతి అంశం ప్రతి అణువు తెలిసిన వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని ఆయన పాలనలో మనం సుభిక్షంగా ఉన్నామని మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అభివృద్ధిలో ముందుందాంమని తెలిపారు.మాజీ టూరిజం శాఖ మంత్రి భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎంతో నష్టపోయామని నాగార్జునసాగర్ ప్రాజెక్టు 19 కిలోమీటర్ల కట్టినట్లయితే తెలంగాణలోని ఏడెనిమిది జిల్లాల కు నీటి కాలువలు అందుతుండేదని అన్నారు. కోహెడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిప్పారపు జ్యోతి మాట్లాడుతూ నా యొక్క విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరు సహకారంతో ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో సేవలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోహెడ జడ్పిటిసి నాగరాజు శ్యామల ఎంపీపీ కొక్కుల కీర్తి పాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు వెంకటేశ్వర పల్లి సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి నైస్ ఎంపిపి తడికల రాజిరెడ్డి ఎంపీటీసీ ఖమ్మం స్వరూప ఎంపీటీసీల ఫోరం అధ్యక్షు డు కుమారస్వామి భీమ్దేవరపల్లి జడ్పిటిసి వంగ రవీందర్ జడ్పిటిసి భూక్య మంగ మాజీ డైరెక్టర్ లు రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్