27.7 C
Hyderabad
Tuesday, April 23, 2024
హోమ్తెలంగాణహరీష్ రావు కృషితో ఖమ్మం సభ సక్సెస్

హరీష్ రావు కృషితో ఖమ్మం సభ సక్సెస్

హరీశ్ రావు అవిశ్రాంత కృషితోనే ఖమ్మం సభ సక్సెస్. నామ నాగేశ్వరరావు

యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్నీ అబ్బురపర్చేలా ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావును బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అభినందించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయన పర్యటన ముగించుకుని, బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఎంపీ నామ వెంటనే వెళ్ళి హరీశ్ రావును కలసి, పుష్పగుచ్చం అందజేసి, ప్రత్యేకించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఖమ్మం చేరుకుని ఉమ్మడి జిల్లా ప్రజల మధ్యలోనే ఉంటూ నభ ఏర్పాట్లు చూస్తూనే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి, నాయకులందర్నీ ఏక తాటి పైకి తీసుకొచ్చి, జన సమీకరణ చేయించి, ఊహించిన దానికంటే మిన్నగా సభను సక్సెస్ చేయించిన ఘనత హరీశ్ రావుకే దక్కుతుందని నామ అన్నారు. రేయింబవళ్లు నాయకులందరితో మాట్లాడుతూ సభ గురించి, వారిలో ఉత్సాహం, చైతన్యం నింపి, ప్రధాన భూమిక వహించారని నామ కొనియాడారు ఆయన చేసిన కృషి, పట్టుదల, శ్రమ ఫలితంగానే యావత్ దేశం అబ్బురపడేలా సభ సక్సెస్ చేసుకోగలిగామని నామ అన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్