“హరీష్ రావు గర్వానికి హుజురాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు…

332

నాకు టైం వస్తుంది రెడీగా ఉండు హరీష్” అంటూ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గురువారం హైదరాబాద్ కు పయనమైన ఆయనకు కరీంనగర్, కొత్తపల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, రంగదాంపల్లి, గజ్వేల్ తదితర చోట్ల జన నీరాజనం పలికారు. సిద్దిపేటలో రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం సిద్దిపేట పిడికిలి ఎత్తితే సంబుర పడ్డదని, ఆ నినాదాన్ని తెలంగాణ ప్రజలందరూ భుజం మీద వేసుకొని రాష్ట్ర సాధనలో కదం కదిపి రాష్ట్రం తెచ్చుకున్నారని అన్నారు.
ఇప్పుడు సిద్దిపేట ప్రజలు హరీష్ రావును గెలిపిస్తే భారీ మెజార్టీ తో గెలిపిస్టే …ట్రౌబుల్ షూటర్ అంటూ ఎక్కడ ఎన్నికలు జరిగిన అక్కడ ఇన్చార్జిగా వేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంట, గ్రామాలను దత్తత తీసుకుంట అంటూ మాట్లాడుతూన్నారని ఇది ఎలా సాధ్యం అవుతుందని… తెలివి అతనికే ఉంది అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు తాము ఏది చెప్పినా నమ్ముతారని, అనుకుంటున్నాడని ఏ గర్వంతో ఇవన్ని చెప్పాడని అడిగారు.
మంత్రి హరీష్ రావు గర్వాన్ని ప్రజలు తమ తీర్పుతో తిప్పి కొట్టారని అన్నారు.
ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని మసలుకోవాలని ఈ గడ్డ నుండి హెచ్చరిస్తున్నాని అన్నారు. ధర్మాన్ని పాత వేయడానికి, ప్రజాస్వామ్యాన్ని చంపడానికి, మానవసంబంధాలను తుంచాడానికి హరీష్ రావు చేసిన ప్రయత్నాలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారన్నారు.

హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైతే డబ్బులు, మద్యం కుట్రలకు పాల్పడ్డారో ఆలాగే వాటికి బలి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని జోస్యం చెప్పారు. ఆయన నియోజకవర్గంలోని ప్రజలు ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వీరిని అధికారంలోకి తెచ్చింది, అభివృద్ధి చేయడానికి, ప్రజలను చల్లగా చూడడానికి, కానీ దౌర్జన్యం చేయడానికి కాదంటూ ఘాటుగా మాట్లాడారు. దళిత బంధు ను కేవలం హుజురాబాద్ లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర మంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ మరో కామెంట్ కూడా చేయడం విశేషం, సిద్దిపేటలో కూడా దళిత గర్జన సభ పెట్టె రోజు వస్తుందన్నారు. ఆ రోజున సభకు తానే నాయకత్వం వహిస్థానని ప్రకటించారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి