హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం

309

హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రానున్న శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి సిపిఐ పార్టీ పోరుకు సిద్ధపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.సోమవారం నాడు హుస్నాబాద్ లోని స్థానిక అణభేరి,సింగిరెడ్డి అమరుల భవన్ లో జరిగిన సిపిఐ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరై సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ గత ఏడు సంవత్సరాల్లో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని. రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి సిపిఐ పార్టీగా బరిలో ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్, సిద్దిపేట,కరీంనగర్ జిల్లా కార్యదర్శులు మంద పవన్,పోనగంటి కేదారి,హన్మకొండ జిల్లా సహాయ కార్యదర్శి,కర్రె భిక్షపతి,ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశ్,బోయిని అశోక్,వెల్పుల బాలమల్లు, యెడల వనేశ్, బత్తుల బాబు, కనుకుంట్ల శంకర్,కనుమాల ప్రతాప్ రెడ్డి,జేరిపోతుల జనార్ధన్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బైరగోని శంకర్, మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు యాద పద్మ,మాలోతు ఉమా,శనిగరం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి