30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణహుస్నాబాద్ అంటే గౌరవం పెరిగింది.

హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగింది.

హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగింది.

హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 02

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రం లక్ష్మి గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అందుకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు కృషి చేశారని, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి.. అందుకు అనుగుణంగా అభివృధి చెకుకుండమని తెలిపారు. రైతులకు
ఇప్పటికే 30 వేల కోట్ల వ్యవసాయం రైతు సంక్షేమం కోసం కేటాయించనని, ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ లో రైతు భరోసా పై నిర్ణయం తీసుకుంటామని అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించిన తుమ్మల నాగేశ్వరరావు సుశించారని, త్వరలోనే
హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్ మార్కెట్ కమిటీ ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నారని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గత బిఅరెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని, రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి తెచ్చింది ఏమి లేదని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశాం ఈనెల లోనే రైతు భరోసా వస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ అమలు చేస్తున్న గ్రామాల్లో 90 శాతం ప్రజలకు లబ్ధి జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుంది.. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తం..ఇళ్ల కేటాయింపులో చాలా పారదర్శకంగా ఉంటుందని ఇందులో ఎవరి జోక్యం ఉండదని అన్నారు. సింహారాయ జాతర లోపు రోడ్లు మరమత్తులు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఇచ్చాం.. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గౌరవం పెరిగిందని, కోహెడ మండలం నుండి 20,172 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని, సన్న వడ్లకు 500 బోనస్ కూడ ఇచ్చాం.. కోహెడలో కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు అయింది అని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్