“యువగళం” పాదయాత్రకు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
యదార్థవాది ప్రతినిది మెదక్
యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం అవుతుందని తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకే .రమేష్ చందర్ రావ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ లు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. 403 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుందన్నారు.కడప దర్గా లో ప్రార్థనలు చేసి, తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఆంద్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఆంధ్రలో అధికారంలో వచ్చేలా నారా లోకేష్ పాదయాత్ర సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు..
