ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. అయితే అప్పటి వరకూ గర్భాలయ దర్శనాలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.