మంత్రి హరీష్ రావు యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయానికి బంగారం విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో బంగారం ప్రకటించే వారి పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పడంతో ఒక్కరోజులోనే 30 కిలోల బంగారాన్ని కార్యకర్తలు విరాళంగా ప్రకటించారు. బంగారం సేకరణకు సిద్దిపేటలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రజల పక్షాన బంగారం లక్ష్మీ నరసింహ స్వామికి ఇద్దామని మంత్రి తెలిపారు.