25న ఉపరాష్ట్రపతి పర్యటన
-ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: కృషి విజ్ఞాన కేంద్రం ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పరిపాలన అధికారి రాహుల్ రాజ్ శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్, తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. ఈనెల 25న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి రానున్నారని విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలు వివరాలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు