8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
నిర్మల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిర్మల్ మండలంలోని లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామనికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.. శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.