సదరన్ సమావేశాల నేపథ్యంలో తిరుమలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో వి ఐ పి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు సదరు తేదీలో సిఫారసు లేఖలు తీసుకోమని టీటీడీ తెలిపింది. నవంబర్ 14న సదరన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ , కేరళ , తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ కారణాల దృష్ట్యా దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది . సీఎం జగన్ ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాలనే విషయాన్ని చర్చకు పెట్టాలని నిర్ణయించారు. తమిళనాడు నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు పై చర్చించాలని నిర్ణయించారు. ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు ప్రస్తావించాలని నిర్ణయించారు.