ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర దక్షిణ కుంభమేళా గా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం రూ 75 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల స్త్రీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యంత వైభవంగా ఈ జాతర సాగనుందని తెలిపారు. కరోన కష్ట కాలం లో బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క-సారలమ్మ జాతరకు 75 కోట్లు విడుదల చేయడం పట్ల ఆదివాసీలపై సీఎంకు ఉన్న ప్రేమ నిదర్శనం అన్నారు.