36.9 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్జాతీయప్రమాదానికి గురైన ప్రహ్లాద్‌ మోదీ కారు..!

ప్రమాదానికి గురైన ప్రహ్లాద్‌ మోదీ కారు..!

ప్రమాదానికి గురైన ప్రహ్లాద్‌ మోదీ కారు..!

మైసూర్ 27 డిసంబర్

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది… ఈ ఘటనలో ప్రహ్లాద్‌ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ మైసూరులోని ఎస్‌జే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం 2గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బందిపురా వెళ్తుండగా.. మైసూరు సమీపంలో ప్రహ్లాద్‌ మోదీ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రహ్లాద్‌ మోదీతో పాటు భార్య, కొడుకు, కోడలు, మనుమడు ఉన్నారు. ప్రమాదంలో అందరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న మైసూరు ఎస్పీ సీమా లట్కర్‌ ఆస్పత్రికి వెళ్లారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్