వైన్స్ లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
* పరారిలో మరొకరు
* స్కూటీ ఫోన్ స్వాధీనం
యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి
పెద్దనపల్లిలోని వైన్ షాపులో దొంగతనాలు పాల్పడిన నిందితుల అరెస్టు వివరాలను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సుల్తానాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్, బంగారి కుంటకు చెందిన అబ్దుల్ షాకీబ్ లను అరెస్ట్ చేయగా ఎండి గౌస్ పరారిలో ఉన్నట్లు తెలిపారు. సోమగూడెం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని ఆపి ప్రశ్నించగా సరైన సమాదానం ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా
గత నెల తేదీ 19.03.2023 రోజున రాత్రి రెండు గంటల సమయంలో స్టేషన్ పెద్దనపల్లి లోని ఆర్ఎస్ వైన్స్ వద్ద మూడు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇనుప కడ్డీలతో ఆర్ఎస్ వైన్స్ షెటర్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి రెండు మొబైల్ ఫోన్లను 20 వేల రూపాయల నగదును మరియు లిక్కర్ బాటిల్స్ ని దొంగిలించి ఆ తర్వాత దొంగిలించిన వాటిని ముగ్గురం పంచుకున్నామని ఆ తర్వాత గౌస్ కరీంనగర్ వెళ్తున్నానని చెప్పి గ్రామం నుంచి వెళ్లిపోయాడని, మళ్లీ అదే విధంగా దొంగతనం చేయడానికి రెక్కీ చేయగా పట్టుకున్నట్లు తెలిపారు.