సన్ సైన్ ఆస్పత్రిలో ప్రధాన వాటాను ప్రముఖ ఆస్పత్రి క్రిష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ కొనుగోలు చేసింది సన్ షైన్ ఆస్పత్రిలో 10.07 శాతం వాటాను కొనుగోలు చేసుకునేందుకు కిమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఆస్పత్రి వ్యవస్థాపకులు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి తో పాటు ఆయన సహచర వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రిలో కలిసి ఇ పనిచేయాల్సి ఉంటుంది ఈ వాటా కొనుగోలు తో తొమ్మిది నగరాల్లో 12 ఆస్పత్రులు 3666 పన్నెండు వందల మంది ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థల జాబితాలో కిడ్స్ చేరనుంది పదేళ్ల క్రితం సన్ సైన్ లు గురువారెడ్డి స్థాపించగా ఆగ్నేయాసియా దేశాల్లో రెండు అతిపెద్ద జాయింట్ రిప్లేస్ మెంట్ సెంటర్ గా కొద్దిరోజుల్లోనే గుర్తింపు తెచ్చుకుంది ఇందులో ప్రతి ఏడాది నాలుగు వేలకు పైగా మోకీలు ఆపరేషన్లు చేస్తున్నారు కరీంనగర్ లోని సన్ సైన్ హాస్పిటల్స్ లో 6000 లకు పైగా గా బెడ్స్ ఉన్నాయి 2021 22 ఆర్థిక సంవత్సరానికిగానూ 411 కోట్ల ఆదాయాన్ని 11 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని సంస్థ పొందింది 730 కోట్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ ఆసుపత్రిలో 51.07 శాతం వాటాను రూపాయలు 362.78 పాయింట్ సెవెన్ ఎయిట్ కొనుగోలు చేస్తున్నట్లు కిమ్స్ ఆస్పత్రి తెలిపింది..
మాజీ మిస్ తెలంగాణ హాసిని ఆత్మహత్యాయత్నం . లైవ్ వీడియో పోస్ట్…
ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరేసుకొని ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది మాజీ మిస్ తెలంగాణ హాసిని హైదరాబాద్ నారాయణగూడ లోని రోడ్ నెంబర్ 6 లో ఉన్న ఆమె ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుందనే సమాచారాన్ని మిత్రులు పోలీసులకు చేరవేయడంతో వారు వారు వెంటనే అక్కడికి చేరుకునే సమయానికి ఆమె ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది వెంటనే పోలీసులు ఆమెను రక్షించి హుటాహుటిన హైదర్గూడా లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె క్షేమంగానే ఉందని తెలిపారు స్నేహితులు ఆమె పోస్టులు చూడడం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ఆ వెంటనే వారు వెంటనే స్పందించి అక్కడ రక్షించడం వల్లనే ఆమె ప్రాణాలతో బయట పడిందని స్నేహితులు వివరించారు అయితే ఆమె ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఏమైనా ఉంటాయ అనేది తెలియాల్సి ఉంది అయితే తే.గీ ఆసిని కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం కాగా ఇటీవల ఆమె జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో తనను ఓ యువకుడు లైంగికంగా విధిస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం..
మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి స్వాదినం చేసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు…
ఒరిస్సా టు తెలంగాణ వయా ఆంధ్ర పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ఎం రవీంద్రనాథ్ బాబు ద్వారా నమ్మదగిన సమాచారం తో గత మూడు నెలల నుండి అక్రమ రవాణా
అరికట్టేందుకు చాకచక్యమైన చర్యలు చేపట్టి ఆధిక మొత్తం లో గంజాయిని పట్టుకోవటం జరిగింది. దీనిలో భాగంగా గత 25 రోజులుగా అన్నీ ఏజెన్సీ ప్రాంతాలు, పోలీసు స్టేషన్ల పరిధిలో 24×7 వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా గంజాయి స్మగ్లింగ్ తగ్గినది. అయినప్పటికి గంజాయి తరలించడానికి అనేక మార్గాలను యెంచుకుంటున్న గంజాయి అక్రమ రవాణా దారులు పటిస్టమైన పైలెటింగ్ వ్యవస్తను యేర్పాటు చేసుకుని గంజాయి తరలిస్తున్నారు. గంజాయ్ తరలించడానికి మోటార్ సైకిలను, కారులను ఉపయోగిస్తూ పోలీసు స్టేషన్ ల పరిధి నుండి దాటవేస్తున్నారు. గంజాయి రవాణా జరుగుతున్న విషయాన్ని జిల్లా SP ద్వారా తెలుసుకొన్న పోలీసులు చింతూరు మండలం, మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుకుమామిడి బ్రిడ్జి వద్ద, చింతూరు సబ్-డివిజన్ ఏ.ఎస్.పి. G.కృష్ణకాంత్ చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ G. యువకుమార్ , మోతుగూడెం సబ్-ఇన్స్పెక్టర్ శ్ వి.సత్తిబాబు సిబ్బందితో చేపట్టిన వాహనాల తనిఖీలో మొత్తం 2000 కేజీల గంజాయిని ఒక ఐచర్ వ్యాన్లో 20 మూటల కొబ్బరికాయల లోడ్ వేసుకుని వాటికింద గంజాయిని లోడ్ చేసి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా సదరు వాహనానికి ముందు ఒక హెూండా 1-20 Asta కారు నెంబర్ ఏపి 37సిబి 8888 నందు ఒక వ్యక్తి సదరు గంజాయి వ్యాన్ కు హెల్పర్ గా వెల్లుచుండగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2000 కేజిల గంజాయిని, ఒక ఐచర్ వ్యాన్ (No.TS12 UA 9816), ఒక హెూండా i-20 Asta కారు (No.AP37CB-8888), 20 కొబ్బరికాయల మూటలను మరియు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 1) కడియం గురు సాగర్, తండ్రి వేంకటేశ్వర రావు, వయస్సు 34 సం. గ్రామం కొత్తపల్లి, మండలం లింగాపురం, జిల్లా ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం, 2) పొగిడాల పర్వతాలు, తండ్రి నాగయ్య, వయస్సు 36 సం.లు.గ్రామం గంట్రావుపల్లె, మండల్ పెద్ద కొత్తపల్లి,జిల్లా నగర్ కర్నూల్ , తెలంగాణ రాష్ట్రం, 3) నైని రామరావు తండ్రి సుందరయ్య, వయస్సు22 సం.లు, గ్రామం గుర్రాలురు, మండల్చిత్రకొండ , మల్కాన్ గిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం. స్వాధీన పరుచుకున్న ప్రోపర్టీ వివరాలు: 1) 2000 KGల గంజాయి, సుమారు విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు. 2) ఒక ఐచర్ వ్యాన్ (No. TS12 UA 9816) 3) ఒక హోండా 1-20 Asta కారు(No. AP37CB-8888). 4) నగదు రు.2000/ 5) మూడు సెల్-ఫోన్లు. ఈ పట్టుకున్న గంజాయి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ముంచుకొస్తున్న మూడో వేవ్ కరోనా ఇప్పటికే బెంగళూరులో కేసుల గుర్తింపు…
మొన్నటిదాకా సెకండ్ వేవ్ కరోనా కారణంగా దేశం ఎంత అల్లాడి పోయిందో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుంది. ఈ వార్త వింటేనే గుండెలు గుబెల్లుమన్నాయి. మొదటి రెండు కరోనా లతో దేశం మొత్తంలో వదిలించుకొని వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య పరమైన రక్షణ చర్యలు తీసుకొని ఇప్పుడే బయట పడ్డాం అయితే ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందని పరిస్థితులు చూస్తుంటే చెప్పక తప్పదేమో అనిపిస్తుంది. మూడవ దశ ముంచుకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. పండగ ల సీజన్లు ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో కొత్తరకం కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు ఈ నగరంలో ay 4.2 అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.l అయితే ఈ వైరస్ వేరియంట్ గుర్తించేందుకు కు నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఈ కొత్త వైరస్ సోకిన వారు ఇద్దరూ కూడా బెంగళూరుకు చెందిన వారే నని గుర్తించారు వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు ఈ కొత్త వేరియంట్ యూ కె డెన్మార్క్ లండన్ జర్మనీ ఐర్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా గుర్తించినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా గా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రదీప్ మాట్లాడుతూ ఈ కొత్త వేరియంట్లలో రాష్ట్రంలో లో ఏడు కేసులను గుర్తించినట్లు తెలిపారు బెంగళూరులో 3 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు ఉన్నట్లు వెల్లడించారు అయితే ఈ కొత్త వేరియంట్ వల్ల ఇలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు యూకేలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వైరస్ ఏ మేరకు విస్తరిస్తుంది ఎలాంటి ప్రభావం చూపుతుంద
చెట్ల పొదల మధ్య చిట్టి తల్లి.. ఏ తల్లి కన్న కన్నబిడ్డనో మరి…!
ఏ తల్లి బిడ్డ నో కానీ … పురిట్లోనే ఆ తల్లి కన్న బిడ్డని చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళి ఉండవచ్చు . చెట్ల పొదల్లో నుంచి పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో ఆ గ్రామస్తులు ఆ శిశువును చెట్ల పొదల్లో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ చెరువు పక్కన చెట్ల పొదల్లో ఆడ శిశువు లభించడంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లారు పాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు..
నేటితో ఉప ఎన్నికల ప్రచారం ముగింపు.. తెరపైకి మందు సీసాలు, నోట్ల కట్టలు…!
హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాజకీయ పార్టీలు ప్రలోభాల కు తెరదించాయి. స్థానికేతరులు సాయంత్రం 7 నుండి నియోజకవర్గం విడిచి వెళ్లిపోయారు. గురువారం రాత్రి నుండి రాజకీయ పార్టీలు నగదు పంపిణీ పై నాజర్ పెట్టారు, ఈ ఎన్నికలు అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఏలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరోలెక్క, అన్నట్లు ఒక్క ఓటుకు ఐదు వేల నుండి పదివేల వరకు గుట్టుచప్పుడు కాకుండా
ప్రత్యేక కోడ్ భాషను ఎంచుకోని కవర్లో పెట్టి ఇస్తున్నట్లు తెలుస్తుంది..
మహాయోధుడు, గోండురాజ్య స్వాప్నికుడు.. కొమరం భీమ్..
తమ జీవితకాలంలోనే లెజెండ్‌గా మారిన మహామహులలో కొమరం భీం ఎన్నతగినవాడు. జనగాం (ఆసిఫాబాదు) అవ్వల్ తాలూక్‌దారు (నైజాం కాలంలో కలెక్టర్‌ని అవ్వల్ తాలూక్‌దారు అనేవారు) మౌల్వీ అబ్దుల్ సత్తార్ 1940లో ఆ వీరుడి గురించి తన నివేదికలో అమితంగా పొగిడాడు. భీంలో ఏదో సాధించాలనే గాఢ వాంఛ, తన పంతమే నెగ్గాలనే పట్టుదల ఒకదానితో ఒకటి పడుగుపేకల్లా పెనవేసుకుని ఉన్నాయి. త్వరలోనే ఓ గోండురాజ్యం స్థాపించబడుతుందని, సర్వశక్తిమంతమైన నిజాం ప్రభువు సామ్రాజ్యాన్ని భీం అంతమొందిస్తాడని గోండుల దృఢమైన నమ్మకం’ అని ఆయన పేర్కొన్నారు.తన తెగ అజేయమైనదని భీంకి అంతులేని విశ్వాసం. అందువల్లే అతడు తన అనుచరులతో జిల్లా కేంద్రమైన జనగాంను (ఆసిఫాబాద్) ముట్టడించి, దానిని స్వాధీనం చేసుకుంటాడని నిజాం ప్రభుత్వం భయపడింది. ఈ భయం వల్లే జిల్లాకేంద్రాన్ని ఆసిఫాబాదు నుంచి ఆదిలాబాదుకు మార్చింది. భీం జన్మించిన సంవత్సరం బహుశా 1901 అయిఉండవచ్చు. నైజాం వెలుపలి ప్రాంతాల నుంచి భీం హైదరాబాదు సంస్థానంలోకి వచ్చాడని అబ్దుల్ సత్తార్ అంటాడు. భీం సాధారణ శరీరసౌష్ఠవం, మామూలు ఎత్తు కలిగిన వ్యక్తి. కొద్దిగా ఎత్తు పళ్లు ఉండేవి. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచేవాడు. నడుస్తూ మాట్లాడేవాడు. అతనిది కంచుకంఠం. గట్టిగా, బిగ్గరగా మాట్లాడేవాడు. గోండులు ధరించే సంప్రదాయ దుస్తులనే ధరించేవాడు. చేతిలో గుత్ప (దుడ్డుకర్ర)పట్టుకుని, చంకలో గొడుగు ఉంచుకునేవాడు. తలపాగా ధరించేవాడు. అప్పుడప్పుడు రూమీ టోపీ పెట్టుకునేవాడు. భీం చదువుకున్నాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలు రాయడం, చదవడం వచ్చు. వృత్తిరీత్యా రైతు. ఇతర రైతుల మాదిరిగా భూమినే నమ్ముకుని పగలు, రాత్రి శ్రమించేవాడు. పిల్లలను ముద్దు చేసేవాడు. వాళ్ల చదువుల కోసం ఒక పంతులును కూడా నియమించాడు. అతడికి దైవభక్తి ఎక్కువే. గోండు దేవతలను నిత్యం ఆరాధించేవాడు. ముస్లింల పట్ల ద్వేషం, వైరం ఎన్నడూ ప్రదర్శించేవాడు కాదు. అణిచివేతకు లొంగే తత్వం భీంలో ఏ కోశానా లేదు. అందుకే అటవీ అధికారులు బాబాజరీలో గోండుల గుడిసెలకి నిప్పుపెట్టి, వారి పొలాలు ధ్వంసం చేసినప్పుడు భీం ఎదురు తిరిగాడు. భీం దూకుడికి అటవీ అధికారులు తోక ముడవక తప్పలేదు. ఇది తెలిసిన అమీన్ (సబ్ ఇన్‌స్పెక్టర్) జాఫర్ అహ్మద్ కొంతమంది పోలీసులను వెంటబెట్టుకొని, అతడిని నిర్బంధంలోకి తీసుకోవడానికి వెళ్ళాడు. తన యత్నంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. భీంకి, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో మహమ్మద్ జాఫర్ తుపాకీ కూడా వదిలేసి బతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించాడు. భీం మూఢనమ్మకాలను విశ్వసిస్తాడని ప్రచారం జరిగింది. అతడు నాస్తికుడు కాదు. తమ దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించేవాడు. తన తెగకి చెందిన అన్నిరకాల కర్మ కాండల్లోనూ పాల్గొనేవాడు. అయితే అతనికి మూఢనమ్మకాలు లేవు. యుద్ధానికి ముందు రోజు వందలమంది గోండులు గుమిగూడిన సభలో అతను ప్రసంగించాడు. పోరుకు ముందుకు దూకలేని పిరికివాళ్లు. ప్రాణభయం ఉన్నవాళ్లు వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చని అందరి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. భీం మూఢనమ్మకాలకు బానిస అయితే, తన విజయం పట్ల అతడికి ఏమాత్రం అపనమ్మకం ఉండేది కాదు. అలాగే భీం దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు, మంత్రశక్తులు ఉన్నాయని కూడా అతడి గురించి కొమరం సూరు చెప్పిన కథల్లో ఉంది. భీం దగ్గర ఆ శక్తులు ఉన్నాయని అతడి అనుచరులూ నమ్మలేదు. వాళ్లుగనక నమ్మి ఉంటే, పోరుకు ముందు రోజు భీం ప్రసంగం తరువాత, కొంతమంది గోండులు జోడెన్‌ఘాట్ నుంచి వెనుతిరిగి పోయేవారు కాదు. యుద్ధానికి ముందుకు కదులుతున్నప్పుడు, గోండులు తమని ఏదో మానవాతీత శక్తి ఆవహించి, కదుపుతున్నట్లు కదులుతారు. అది ఒక రకమైన trance like motion దానివల్లే భీంకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. వీటిని అజ్ఞానులైన తమ పోలీసు కానిస్టేబుల్స్ నమ్మారని అబ్దుల్ సత్తార్ కూడా అన్నాడు. భీం చుట్టూ ఉందని భావించే ఒక మాయాచక్రం, అతడిలో ఉన్నాయనుకున్న మానవాతీత కదలికలు, తుపాకిగుళ్లు శరీరానికి తగిలి గాలిబుడగల్లా పేలిపోవడానికి అతడు ఒంటి నిండా రాసుకున్న ఆకుపసరు.. ఇవేవీ వాస్తవం కావు. అవన్నీ కాకమ్మ కథలే. కొమరం భీం పైకి యుద్ధానికి వచ్చిన పోలీసు పటాలం వెంట సివిల్ సర్జన్ డాక్టర్ నాయుడు కూడా వచ్చాడు. ఆయన యుద్ధంలో చనిపోయిన గోండుల మృతదేహాలకు శవపరీక్ష చేశాడు. ఆ దేహాల మీద ఉన్న గాయలనన్నింటినీ ఆచప విపులంగా వివరించాడు. అవి అన్నీ తుపాకీగుళ్ల గాయాలేనని తన నివేదికలో పేర్కొన్నాడు. అంతేకాదు భీంతో పాటు ఏ గోండు శరీరం మీద ఎలాంటి ఆకుపసరు జాడ కానీ, అలాంటి పసరు పూసుకున్నందు వల్ల ఏర్పడ్డ రంగుగానీ ఎక్కడా లేవని తన అధికారిక నివేదికలో పేర్కొన్నాడు. భీం పుట్టుకతోనే యోధుడు. అతడు రాజగోండు. బాబాజరిలో భీం తన శత్రువుపై మెరుపు దాడి చేశాడు. ఇటువంటి గెరిల్లా తరహా దాడులు కేవలం కాకలు తీరిన యుద్ధవీరులే చేస్తారు. ఒక వీరుడు శత్రుసైన్యాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడు. భీం కూడా అంతే. అందుకే ఇతర బలవంతులైన గోండుల సహాయ సహకారాల కోసం అతడు తన దూతలను వారి దగ్గరకు పంపిస్తాడు. భీం దూతలైన జాకో, కూమరలింగ, పంగడి రాజు దగ్గరకు వెళ్లి అతడి చేరవేశారు. ప్రాణాలకు తెగించి దాదాపు ఐదువందల మంది గోండులు చేతికి అందిన ఆయుధాలను తీసుకుని జోడెన్‌ఘాట్‌కి రావడానికి కారణం భీం వాస్తవిక యుద్ధనీతి, అతడిలోని యోధుని లక్షణాలు, గోండురాజ్యం స్థాపించాలనే అతడి ఆశయం తప్ప మరోటి కాదు. భీం మీద దాడి చేయడానికి అవ్వల్ తాలూక్‌దారు అబ్దుల్ సత్తార్, దువ్వం తాలూక్‌దారు ఆగా మహమ్మద్ అలీ, డీఎస్పీ హిదాయతుల్లా సాహెబ్ అరబ్బులు, చావుషులు, సింధీలు ఇంకా రెవిన్యూ అధికారులను వెంటబెట్టుకుని జోడెన్‌ఘాట్‌కి సమీపంలో ఉన్న వాధంలో శిబిరాలు వేసుకున్నారు. సివిల్ సర్జన్ డాక్టరు నాయుడితో పాటు 30 మంది వైద్యసిబ్బంది కూడా వారితో ఉన్నారు. వీళ్లుగాక, ఆనాటి ఆధునిక ఆయుధాలు సమృద్ధిగా కలిగి ఉన్న ప్రత్యేక శిక్షణ పొందిన 94 మంది కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఇంత సైన్యం, ఇంతమంది అధికారులు భీంపై ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయారు. గోండు శ్రేణులలో ఏమాత్రం అలజడిని, భయాందోళనలను కలిగించలేకపోయారు. అందుకే గోండు వీరులు మోగించిన యుద్ధభేరీల సంగీతం జోడెన్‌ఘాట్ కొండలలో గుండెలు పగిలేలా ప్రతిధ్వనించింది. భయంకరమైన యుద్ధం చెలరేగింది. భీం చేసిన పెనుదాడికి తన శ్రేణులలో ముందు వరుసలో ఉన్నవారు తిరోగమించి మరోచోట పొజిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందని అబ్దుల్ సత్తార్ తన నివేదికలో పేర్కొన్నాడు. అతి బలవంతుడైన అబ్దుల్ సత్తార్‌కి ఆ యుద్ధం అన్ని వేళలా అనుకూలంగా లేదు. తనతో మరింత సైన్యాన్ని వెంటబెట్టుకుని రానందుకు అతడు తనని తాను నిందించుకున్నాడు. జోడెన్‌ఘాట్ పోరాటం చాటుమాటు పోరాటం కాదు. ఆ భీకర యుద్ధంలో భీం, అతడి మేనల్లుడు రఘు పోలీసులకు ఎదురుగా 10 గజాల దూరంలోనే వీరమరణం పొందారు. భీం నేలకొరిగిన తరువాతే మిగిలిన గోండులు యుద్ధరంగం నుంచి తప్పుకున్నారు. పై వాస్తవాలన్నీ అతడిని ఒక మహాయోధుడిగా మన ముందు నిలబెడతాయి. అతడు నూటికి నూరు పాళ్లూ సమరయోధుడే. పొడవైన మొగలు కత్తి దూసి ముందుకు వస్తున్న భీం అజేయంగా కనిపించాడు అంటాడు అబ్దుల్ సత్తార్. భీంను ఒక మహాయోధునిగా నిర్ధారించడానికి ఇంతకు మించిన ధ్రువీకరణ పత్రం, ప్రశంసాపత్రం మరేదీ అవసరం లేదు. జోడెన్‌ఘాట్‌లో యుద్ధం జరిగిన రోజు గానీ లేక ఆ మరుసటి రోజు గానీ భీం వీరమరణం పొందాడు. ఆయన 1940 అక్టోబర్ 8న చనిపోయాడని ఓ అభిప్రాయం ఉంది. జోడెన్‌ఘాట్‌లో జరిగిన యుద్ధం గురించిన వివరాలు 1940 అక్టోబర్ 5న ముషీర్-ఎ-డెక్కన్‌లో వచ్చాయని, హోమ్ సెక్రెటరీ మహమ్మద్ అజర్ హసన్‌కి 1940 అక్టోబర్ 7న రాసిన లేఖలో అబ్దుల్ సత్తార్ పేర్కొన్నాడు. 1940 అక్టోబర్ 6న కాశీనాథరావు వైద్య, సిరాజుల్ తిర్మియాజీ, నరసింగరావు, రామాచారి వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఆసిఫాబాదు వచ్చారు. అదేరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, హిందూ ప్రజామండలికి చెందిన వారు కూడా వచ్చారని అబ్దుల్ సత్తార్ పేర్కొన్నాడు. కాబట్టి కొమరం భీం 1940 అక్టోబర్ 5వ తేదీకి ముందే అమరుడయ్యాడనేది వాస్తవం….
టిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.
టిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.
ఆంధ్రలోనూ అక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ప్లీనరీ లో కెసిఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హిట్ ఎక్కారు. ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయి… సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతున్నాయి ఏపీలోనూ టిఆర్ఎస్ పార్టీ ని ప్రజలు కోరుకుంటున్నారన్నా కెసిఆర్ ఆర్ ఆర్ కే కాయలపై స్పందించారు. కెసిఆర్ అన్నట్లుగా ఏపీలో కరెంటు కోతలు లేవు అన్నారు. బొగ్గు సమస్య కేవలం ఆంధ్ర ది మాత్రమే కాదని అన్నారు. దళిత బంధు పథకం పైన అనిల్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఒకే ఒక్క నియోజకవర్గంలో ఆ పథకాన్ని అమలు చేశారని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ పథకం అమలు లేదని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్లో తమ పార్టీని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై స్పందించారు . కావాలనుకుంటే ఏపీలోనూ పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు . కాగా హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన టిఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మాట్లాడుతూ ఏపీ కి సంబంధించి నా అంశాలను ప్రస్తావించారు ఏపీ నుంచి తెలంగాణా విడిపోతే కొత్త రాష్ట్రంలో చీకట్లు అలుముకున్నాయి అని అన్నారు అని కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చీకట్లు అలుముకుంటున్నాయి అన్నారు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు తెలంగాణ పథకాలను పలు రాష్ట్రాలు కాపీ కొడుతున్నారని అన్నారు ఈ విషయంలోనే స్పందించిన మంత్రి అనిల్ ఏపీ లోనే పథకాలు ఎక్కువగా అమలు అవుతున్నాయని తేల్చి చెప్పారు ప్రజల అవసరాలను తగ్గట్లుగా పథకాలను అమలు చేస్తూ వారికి జగన్ సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు
కౌంట్ డౌన్ షురూ … మరో రెండు రోజులే హుజురాబాద్ ఎన్నికలకు కు గడువు
మరో రెండు రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా ప్రచారానికి స్థిరపడి అన్ని మైకులు బంద్ కానున్నాయి. గడువు ముగియనుండటంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా చేస్తున్నాయి.
కస్టమ్స్ వింగ్ సూపరిండెంట్ అరెస్ట్…
కస్టమ్స్ వింగ్ సూపరిండెంట్ అరెస్ట్
హైదరాబాద్ జిఎస్టి భవన్ లో సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచం తీసుకున్న కేసులో కస్టమ్స్ వింగ్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్ లాల్ లను అరెస్టు చేశారు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో విడుదలైన వ్యక్తి నుంచి కిషన్ లాల్ లంచం డిమాండ్ చేశారు. రూపాయలు 20000 లంచం ఇచ్చి సీబీఐకి బాధితుడు మీరు అస్గర్ ఫిర్యాదు చేశాడు దీంతో విచారించిన సి.బి.ఐ సురేష్ కిషన్ లాల్ లంచం తీసుకున్న ట్లు నిర్ధారణకు వచ్చింది