21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 174

వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా గెలుపు

వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా గెలుపు టాస్ ఓడినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 148/8 పరుగులు చేసింది లూయిస్ 56, పూ రా నా 26 పరుగులు చేశారు. కాగా ఆ తర్వాత క 144 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లలో నే మరో 8 వికెట్ మిగిలి ఉండగా టార్గెట్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికా మార్గం 51 dharban 43 హెన్రిక్స్ 39 పరుగులతో రాణించారు విండీస్ బౌలర్లలో ఎస్ కు వికెట్ దక్కింది

సమంత కు కోర్టులో ఊరట…

హీరోయిన్ సమంతకు కూకట్పల్లి కోర్టులో ఊరట లభించింది తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్ లో పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరింది ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు వెంటనే ఆమె కంటెంట్ను తొలగించాలని ఇంజక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆమె వ్యక్తిగత వివరాలు ఎవరు ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది

నైజాం కాలాన్ని గుర్తుచేస్తున్న కెసిఆర్… తరుణ్ చుగ్.

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని హుజరాబాద్ లో విద్యావ్యవస్థ వ్యాప్తికి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు కెసిఆర్ పాలన నైజాం కాలాన్ని గుర్తు చేసిందని అన్నారు గెలిపించి కెసిఆర్ సహకారాన్ని అందించాలని కోరారు మాట్లాడారు.

ఆర్యన్ ఖాన్ విచారణ వాయిదా..

ముంబై డ్రగ్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ నిఖిల్ రోహత్గి వాదనలు వినిపించారు కుట్రపూరితంగా ఆర్యన్ ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నారు ఎం సి బి ఆరోపిస్తున్న 2018, 2019, 2020 వాట్స్అప్ చాట్ లు ఈ కేసుకు సంబంధించినవి కాదని వాదించారు. అటు ఎం సి బి ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరింది.

ఆగస్టులో ఆది పురుష్… ప్రభాస్ చిత్రం కోసం వేగంగా ఫినిషింగ్ టచ్చు లు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆది పురుష్ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పెద్ద పెద్ద యాక్టర్ లను ఎంపిక చేసుకున్నారు. పౌరాణిక గాధ రామాయణం ఈ ఆది పురుష్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడం
అభిమానుల్లో అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అప్ డేట్స్ తో సోషల్ మీడియా శేక్ అవుతుంది. దీనితో ఆది పురుష్ వేగం పెంచింది ఆగస్టు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు వెల్లడించారు.
ఇప్పటికే సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ రావణుడి గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్
ఫినిషింగ్ షూట్లో బిజీగా గడుపుతున్నారు. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి టీఎస్ సిరీస్ బ్యానర్ పై ఐదు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.

అక్రమంగా సంపాదించినదంతా .. హుజురాబాదు లో ఖర్చు చేస్తున్నారు.. – టిఆర్ఎస్ పై ఈటెల బాకులు..

కెసిఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించిన మచ్చ లేకుండా చేశానని అటువంటి తనపై అక్రమ ఆరోపణలు చేసి బయటకు పంపించడని హుజురాబాద్ బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. 18 ఏండ్లు టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించానని గుర్తు చేసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పద్మశాలి కులస్తులతో సమావేశం అయ్యారు. ఈ ఈటెల ఒక్కడిపై పోరాడి గెలవలేక ఈ.. వందల కోట్లు ఖర్చు చేసి ఇన్ని వేల కోట్ల హామీలు ఇచ్చరని మండిపడ్డారు. ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు హుజరాబాద్ నియోజకవర్గలో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ అహకారాన్ని బొంద పెట్టకపోతే రేపు రాష్ట్రానికి పరిచయం రాబోతుందని ఆయన అన్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆస్తులు అమ్ముకుని అయినా కెసిఆర్ దుర్మార్గాల పై పోరాడుతానని అన్నారు. టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే తే పెన్షన్లు దళిత బందు రానివ్వకుండా చేస్తామని అని దుయ్యబట్టారు.
తమకు ఓట్లు లేకుంటే సొసైటీ పాలకవర్గాలను కథం చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేలు బెదిరిస్తునరని అన్నారు.

కట్టుకున్న భర్తను వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో కడతేర్చిన మరో ఇల్లాలు…

ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఐదుగురు పిల్లలు ఉన్న భార్య, ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది. తీరా శవాన్ని మాయం చేసేందుకెళ్తుండగా కారు సహకరించక పోవడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. చేసేదేమీ లేక కారును, కారులో శవాన్ని అలానే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో భార్య బండారం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చినట్లు తేలింది. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . కర్ణాటకలోని గుల్బర్గా పరిధిలోని ఫెరోజాబాద్క చెందిన మహమూద్ ముస్తాక్ పటేల్ ( 46 ) ఇరవై ఏళ్ల కింద నగరానికి వలసొచ్చారు. కుటుంబం తో సహా సైదాబాద్లోని జహంగీర్ నగర్ నివాసముంటున్నారు . ముస్తాక్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడు . అతని భార్య ఫిర్జోద్ బేగం కూరగాయాల వ్యాపారం చేస్తోంది. వారికి ఇద్దరు కూతుళ్లు , ముగ్గురు కుమారులు ఉన్నారు . ఐదురుగు బిడ్డలున్న ఆ తల్లి దారితప్పింది . భర్తకి తెలియకుండా మరొకరితో బరితెగించింది . అమీద్ పటేల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది . ప్రియుడి మోజులో పడిన ఫిర్జోద్ బేగం .. భర్తను చంపేందుకు పథకం రచించింది . ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది . నగర శివార్లకు తీసుకెళ్లి ప్రియుడు అమీద్ పటేల్ , అతని స్నేహితుడు సయ్యద్ నాయబ్తో కలసి ముస్తాక్ పటేల్ను కిరాతకంగా చంపేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు వెళ్తుండగా కారు రిపేరు తో మొరాయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది . హయత్ నగర్ రేడియో స్టేషన్ సమీపంలో రాజస్థాన్ కళాకరుల బొమ్మల తయారీ కేంద్రం వద్ద కారును వదిలేసి నిందితులు పరారయ్యారు . కారులో శవాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం అందిండచంతో పోలీసులకు రంగంలోకి దిగారు . కారులో శవాన్ని పరిశీలించారు . అతని వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్ , భార్య ఫోన్ నంబర్ ఆధారంగా హతుడు ముస్తాక్ పటేల్గా నిర్ధారించారు . భార్య ఫిర్జోద్ బేగంతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది . ఫిర్జోద్ వివాహేతర సంబంధం గురించి తెలియడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టి కీలక విషయాలు రాబట్టారు . కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు తేల్చారు . శవాన్ని తీసుకెళ్తుండగా కారు ఆగిపోవడంతో అక్కడే వదిలేసి పరారైనట్లు వెల్లడైంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు

సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్..

సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్
లను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్
నారసింగి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ లపై భూ వివాదాల కు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ వీరిద్దరూ భూ వివాదాల్లో కల్పించుకున్న ట్లు ఆరోపణలు రావడంతో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వీరిపై చర్యలు తీసుకున్నారు. వీరిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారముంది

పుట్టపాక చీరకు జాతీయస్థాయి గుర్తింపు.

పుట్టపాక చీరకు జాతీయస్థాయి గుర్తింపు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక తేలియా రుమాలు డబుల్ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక కు చెందిన చేనేత కళాకారులు కొలను పెద్ద వెంకయ్య, ఆయన కుమారుడు రవీంద్ర సుమారు పది నెలల పాటు శ్రమించి మగ్గం పై వేసిన మీ చేనేత చీర కు జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్ర ప్రాంతీయ జాతీయ స్థాయిలో మూడు దశల్లో నిపుణు నిపుణుల బృందం పరిశీలించింది.

ఇంకా వీడని కోవిడ్..

ఇంకా వీడని కోవిడ్
కోవిడ్ ఇంకా మనల్ని వీడని నేపథ్యంలో ఈ పండగ సీజన్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. 5 శాతం కంటే ఎక్కువ జిల్లాలో ప్రజలు గుంపులుగా భూమి కూడా వద్దని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ప్రయాణాలు వీలైనంతగా మానుకోవాలని సూచించింది అన్ని శాఖల సమన్వయంతో కోవిడ్ కట్టడానికి కృషి చేయాలని కోరింది.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...