27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 176

ధరణీ భేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మార్గదర్శకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ధరణి ని విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ఇప్పటివరకు 3.5 లక్షల slats బుక్ అయ్యాయని చెప్పారు. వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

నైరుతి రివర్స్ గేర్

రాష్ట్రంలోకి జూన్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి అని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయని అంచనావేసింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఉక్కపోత మొదలైంది ప్రేమ శాతం మామూలుగా ఉండే దానికన్నా తగ్గినట్లు తెలుస్తోంది

అన్ని అయిపోయాక పెళ్లట

సాధారణంగా భారతదేశంలో పెళ్లికి ముందు సెక్స్ ని ఒప్పుకోరు. దీనిని ఎక్కువ మటుకు వ్యతిరేకిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో మాత్రం పెద్దలు ఒప్పుకోవడం తోనే ఇదంతా సాగుతుంది. మోరియ అనే తెగ ఆదివాసీలు తమ పిల్లలకు నచ్చిన భాగస్వామితో పెళ్లి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఇందుకోసం వారు శృంగారం లో పాల్గొనడానికి కూడా స్వేచ్ఛ నిస్తారు. పెళ్లి కన్నా ముందే వారి లైంగిక సామర్థ్యాలపై అంచనాకు రావడానికి ఇది వారి ఆచార మట మరి…

రెండేళ్ళ ఆయుష్షు మింగేసిన కరోనా… భారతీయుల ఆయుష్షు పై కరోనా

రెండేళ్ళ ఆయుష్షు మింగేసిన కరోనా
భారతీయుల ఆయుష్షు పై కరోనా
తీవ్రంగానే ప్రభావం చూపింది. భారతీయుల అర్థాయుష్షు లో సుమారు రెండేళ్లు తగ్గినట్లు ముంబై ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ తన అధ్యయనంలో తేల్చింది. 2019లో దేశంలో పురుషుల సగటు వయస్సు 69.5 కాగా మహిళ సగటు వయసు 72 ఉంది. అయితే 2020నాటికి ఈ వయసు రెండేళ్లు తగ్గింది పురుషులు 67.5 మహిళలు 60 9.8 సగటున నమోదయింది.

ఇక ఇండియన్స్ అందరికీ కరెక్ట్ సైజు చెప్పులు

ఇక ఇండియన్స్ అందరికీ కరెక్ట్ సైజు చెప్పులు
కరెక్ట్ సైజు చెప్పులు ఇకమీదట ఇండియన్స్ దొరకనున్నాయి. . ప్రస్తుతం మనం వాడుతున్న చెప్పులు బ్రిటిష్ అమెరికాకు చెందిన కొలతలు చాలా మంది భారతీయులు సరైన సైజు చెప్పులు దొరకక ఇబ్బందిపడుతుంటారు. దీంతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్ని వయసుల వారి మీద రీసెర్చ్ చేసింది. త్రీడీ ఇమేజ్ స్కానర్ లతో పాదాలను స్కాన్ చేయించి సరైన సైజు నిర్ణయించడానికి సర్వే చేసింది. దీంతో మన భారతీయులు అందరికీ కూడా సరైన సైజు చెప్పులు అందుబాటులోకి రానున్నాయి.

విశ్వవ్యాప్తమైన మన పూల సంబురం…బూర్జ్ ఖలీఫా నెత్తిన బంగారు ‘బతుకమ్మ’

ఖండాంతరాలు దాటిన సాంస్కృతిక వైభవం

పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం

దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’

బతుకమ్మ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం

ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనం

మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ దృశ్య నివేదనం

తెలంగాణ పూలపండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం

దుబాయ్ –

తెలంగాణకే తలమానికమైన పూల పండుగ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ రోజు సాయంత్రం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బతుకమ్మ వీడియోను బూర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి ‌కేసీఆర్ గారి చిత్రపటాన్ని సైతం బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై ప్రదర్శించారు.

రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బూర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన రాష్ట్రానికే గాక, దేశానికి సైతం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం చరిత్రలో నిలిచిపోతుందన్న ఎమ్మెల్సీ కవిత, ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బూర్జ్ ఖలీపా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత పుష్కర కాలంగా బతుకమ్మ పండుగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ జాగృతిని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత, బతుకమ్మ పండుగ ద్వారా ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యులను చేశారు. పువ్వులను పూజించే విశిష్ట సంప్రదాయాన్ని ప్రతీ ఏటా ఊరూ వాడా ఘనంగా జరుపుకునేందుకు ఎమ్మెల్సీ కవిత గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో సైతం తెలంగాణ ఆడబిడ్డలంతా గొప్పగా జరుపుకుంటున్నారు.

ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగ మరింత ప్రత్యేకం. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు నడుంబిగించినట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత, అందులో భాగంగా ప్రతీ ఏటా సరికొత్త విధంగా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించారు. ఇవ్వాల దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ద్వారా, తెలంగాణ పూల పండుగ మరోసారి మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

ఆంధ్రాలో ఐఏఎస్ ల బదిలీ

ఆంధ్రాలో ఐఏఎస్ ల బదిలీ

ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది
ఏపీఐఐసీ బిసి అండ్ ఎండిగా సుబ్రహ్మణ్యం ఆంధ్ర ప్రదేశ్ స్టోరీస్ డైరెక్టర్ గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

పోడు భూముల సమస్యలను పరిష్కరించలి .. సీఎం కేసీఆర్.

పోడు భూముల సమస్యలను పరిష్కరించలి .. సీఎం కేసీఆర్.

పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అడవి భూముల పరిరక్షణ లో జిల్లా కలెక్టర్ల ది కీలక పాత్ర అని అన్నారు.
అడవులను పునర్ జీవింప చేయాలని అన్నారు. వీటిపై ఆధారపడిన గిరిజనులకు మేలు చేయాలని జిల్లాలలో అడవి భూములను పరిరక్షించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అన్నారు.

నా చాట్స్ ను NCB వక్రీకరిస్తుందని.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.

నా చాట్స్ ను NCB వక్రీకరిస్తుందని.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.

డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్
ఒక కొత్త టీట్ చేశారు. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు తన వాట్స్అప్ చాట్ NCB వక్రీకరిస్తుందని
తన పిటిషన్లో పేర్కొన్నారు.

గుండెపోటుతో కాట్రగడ్డ బాబు హఠాన్మరణం

గుండెపోటుతో కాట్రగడ్డ బాబు హఠాన్మరణం

టిడిపి సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాట్రగడ్డ బాబు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు 25 సంవత్సరాలుగా ఆయన టిడిపిలో పాలు పదవుల్లో కొనసాగారు అలాగే కే.జి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...