30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 177

ఉత్కంఠ పోరులో విజయం సాధించింది.

దుబాయ్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ మొదటిరోజు అద్భుతమైన, అదిరిపోయే ఆటతీరు తో ప్రత్యర్థి జట్టును కోలుకోనివ్వకుండా బౌలింగ్ చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో కేవలం 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగల్గింది.తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి121 వికెట్లతో ఉత్కంఠ పోరులో
విజయం సాధించింది.

 

రఘురామ ఇంటిపై దాడికి వైసీపీ స్కెచ్ : ఆంధ్ర తాజా తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు

రఘురామ ఇంటిపై దాడికి వైసీపీ స్కెచ్ : ఆంధ్ర తాజా తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్ర తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుమానం కలుగుతుంది. టిడిపి ఆఫీస్ లో, ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడులు జరిగినట్లే భీమవరం లోని తన ఇంటిపై కూడా దాడులు దాడులు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ కార్యకర్తలకు సమాచారం వచ్చిందని తన వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని తాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానాని బిజెపి కి లేఖ రాశానని వెల్లడించారు. మంగళగిరిలో కాబట్టి దాడులతో ఊరుకున్నామని అదే రాయలసీమలో అయితే పరిస్థితి హత్యల వరకు వెళ్లలేదని వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా సీఎం జగన్ పై కేసు విచారణ వేగవంతం చేయాలంటూ రఘు రామ తాజాగా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఢిల్లీలో లో మీ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. జగన్ పై ఉన్న కేసుల విచారణ తొందరగా జరిగితే మంచిదంటూ రఘు రామ వ్యాఖ్యానించారు. జగన్ పై కేసులు విచారణ తొందరగా పూర్తయితే ఆయన్ని ఎవరు వేలెత్తి చూపే అవకాశం ఉండదని, కింది కోర్టులో పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేయదన్న నమ్మకం ఉందన్నారు. తాను గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పెట్టిన పిటిషన్ల తో తాజా పిటిషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

విడాకులు ఇచ్చింది నా భార్యకె… నా పిల్లల తల్లికి కాదు… నటుడు ప్రకాష్ రాజ్

విడాకులు ఇచ్చింది నా భార్యకె… నా పిల్లల తల్లికి కాదు… నటుడు ప్రకాష్ రాజ్

నటుడు ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య లలిత కుమారి కి విడాకులు ఇచ్చి 2010 ఆగస్టులో పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ప్రకాష్ రాజ్ మొదటి భార్యతో ముగ్గురు పిల్లలు అయ్యారు. అందులో ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. 5 ఏళ్ల వయసులో వయస్సున్న కొడుకును ప్రకాష్ రాజ్ కోల్పోయాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం మా ఎన్నికల వేడిలో కీలకంగా మారిన ప్రకాష్ రాజ్ తన లైఫ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. తన మొదటి భార్య లలిత కుమారి కి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించారు. తన భార్య తో పడక కోర్టుల వరకు వెళ్ళవలసి వచ్చింది విడాకులు తీసుకున్నాము కానీ నా భార్యకు మాత్రమే విడాకులు ఇచ్చాను పిల్లలకు కాదు,. నా తల్లి తన కోడలికి ఇవ్వలేదు విడాకులు కేవలం మా ఇద్దరి అంశం మాత్రమే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపించి నా పెద్ద కూతురు అమ్మ చెల్లి లను అడిగాను. నా పెద్ద కూతురు వెరీ గుడ్ డాడీ అని చెప్పింది ఆ తర్వాత నే నేను పెళ్లి చేసుకున్నాను. నా కూతురు పెళ్లి చేయాల్సివస్తే నేనే నేనే ముందు ఉంటాను.

పండగకు ప్రత్యేక రైళ్లు

పండగకు ప్రత్యేక రైళ్లు

దీపావళి పండగ పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళ్లే వారికి రైల్వే శాఖ కొత్త రైళ్లు నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్, విశాఖపట్నం నుండితిరుపతిల మధ్య ప్రత్యేక వికీ రైళ్లను నడపనుంది. ఈ రైళ్ల కోసం రిజర్వేషన్ ను ఆశాఖ ప్రారంభించింది నవంబర్ 2 సాయంత్రం 5-35 విశాఖపట్నం బయల్దేరానున్న ప్రత్యేక రైలు (08585) బుధవారం ఉదయం 7-10కి చేరుకుంటుంది అలాగే నవంబర్ 3న రాత్రి 9-05 సికింద్రాబాద్ నుండి బయల్దేరు ప్రత్యేక రైళ్లు (08586) గురువారం ఉదయం 9-50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది దువ్వాడ సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ అ గుంటూరు టూ మిర్యాలగూడ నల్లగొండ రైల్వే స్టేషన్లలో ఆగం ఉంది ఈ స్పెషల్ ట్రైన్లలో ఏసీ టు టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, సెకండ్ క్లాస్ ఉంటాయి. నవంబర్ 1న 7-15 సాయంత్రం విశాఖపట్నం నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్ (08583) మంగళవారం ఉదయం 7-30 తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుండి నవంబర్ 2న మంగళవారం రాత్రి 9-55 బయలుదేరు రైలు (08584) బుధవారం 10 -20 చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగం ఉంది దీపావళి పండగ సందర్భంగా ప్రయాణం చేయదలుచుకున్న వారికి రైల్వే శాఖ మంచి అవకాశం కల్పించింది.

రసవత్తరమైన పోరు రేపే: T20 వరల్డ్ కప్ భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

రసవత్తరమైన పోరు రేపే: T20 వరల్డ్ కప్ భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు 28 నెలల తరువాత దుబాయ్ వేదికగా T20 వరల్డ్ కప్ భారత్ పాకిస్తాన్ రేపు జరగనుంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ అంటేనే ఒక విధమైన ఉత్కంఠ, ఇప్పటివరకు 59 టెస్ట్ మ్యాచ్ జరగగా భారత్ 9 మ్యాచ్ గెలిచింది పాకిస్తాన్ 12 మ్యాచ్ గెలిచింది మిగిలిన 38 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. 132 వన్డే మ్యాచ్ లు జరిగినవి భారత్ 55 మ్యాచ్ లు గెలిచింది. పాకిస్తాన్ 73 మ్యాచ్ లు గెలిచింది. టి20 8 మ్యాచ్ లు జరగగా భారత్ 6 మ్యాచ్ లు గెలిచింది. పాకిస్తాన్ 1 మ్యాచ్ గెలిచింది. 1 మ్యాచ్ టై గా ముగిసింది. అసలు సిసలు మ్యాచ్ కు తయారైన భారత జట్టు ఇలా ఉంది క్యాప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాష్ అయ్యార్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్,కే ఎల్ రావుల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్ ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, శార్థుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి పాల్గొంటున్నారు.

రాష్ట్రాన్ని దోచుకునేందుకే ఆ మూడు పార్టీలు ఆరాట పడుతున్నాయి: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్ఆర్ వ్యవస్థాపకురాలు షర్మిలపై విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకునేందుకు వీరు ముగ్గురు ముందుకు వచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం లేక హైదరాబాద్ , తెలంగాణపై పెత్తనం చెలాయించాలనే ఆలోచనతో వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని అన్నారు . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వీరు ముగ్గురు సీఎం కేసీఆర్ ను నిందిచడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. హుజురాబాద్ లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఉపఎన్నికలో విపక్షాలకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు . టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.

కరోనా మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది.

కరోనా మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది.

* ఇప్పటికే రష్యా లో ప్రభుత్వం కార్యాలయాలకు సెలవులు.
* చైనా లో బడుల మూత, ఇతర దేశాల
విమానాల రద్దు.
* బ్రిటన్ రష్యా చైనా లో భారీగా కేసులు.

సెలెబ్రెటీలకు స్పెషల్ ఏమి లేదు -అందరిలాగే మీ కేసు కూడా -పరువు నష్టం కేసు వేసిన సమంత తరపు న్యాయవాది కి స్పష్టం చేసిన న్యాయమూర్తి

సెలెబ్రెటీలకు స్పెషల్ ఏమి లేదు
-అందరిలాగే మీ కేసు కూడా
-పరువు నష్టం కేసు వేసిన సమంత తరపు న్యాయవాది కి స్పష్టం చేసిన న్యాయమూర్తి

సినీ నటులు నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపై మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే ఎక్కువగా సమంత మీదనే కథనాలు వెలువడ్డాయి. ఇంకొందరు ఏకంగా సమంతకు
ఫ్యాషన్ డిజైనర్ స్టైలిష్ ప్రీతం జుకల్కర్కు
మధ్య రిలేషన్ నే అంట కట్టారు. సంథింగ్ సంథింగ్ ఉన్నదని దారుణంగా రూమర్స్ క్రియేట్ చేశారు.
అయితే ఇలా తన మీద తప్పుడు వార్త రాసిన వారిపై సమంత చర్యలకు దిగుతోంది తనపై పై వాక్యాలు చేసిన యూట్యూబ్ ఛానల్లాపై కూకట్పల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే సమంత తరపు న్యాయవాది కేసును త్వరగా విచారణ చేపట్టాలని కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ముందు అందరూ సమానమే అని సెలబ్రెటీలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఏదీ ఉండదని సమయం వచ్చినప్పుడే విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం చేసిన మీడియా పత్రికల యూట్యూబ్ ఛానల్లా వారు క్షమాపణలు చెప్పేలా చూడాలని సమంత కోరారు. పరువు నష్టం ఎంత అనేది తర్వాత కోరుతానని వెల్లడించారు.

టూత్ పేస్ట్ లో ఉప్పుందా హరీష్ అగ్గిపెట్టెలో లో పుల్లలు ఉన్నాయా అంటూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు

టూత్ పేస్ట్ లో ఉప్పుందా హరీష్ అగ్గిపెట్టెలో లో పుల్లలు ఉన్నాయా అంటూ
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల క్రమంలో యుద్ధం నడుస్తోంది అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు బిజెపి కాంగ్రెస్ నడమ హోర హోరి పోటీ నడుస్తోంది. బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేసిన బండి సంజయ్ సెటైర్లతో తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడకల ఇల్లు ఇవ్వడం లేదని రాష్ట్రంలో లో నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఇవ్వడం లేదు ఎందుకని అడిగారు. కానీ మంత్రి హరీశ్ ఏమో హుజురాబాద్ ప్రచారానికి వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్కి కేంద్ర ప్రభుత్వం 29 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక రూపాయి ఇచ్చి మేమే ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్నారు. ఫోర్జరీ లేఖలతో బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన అన్నారు. ఎప్పుడు బి జె పి సంక్షేమానికి, దళిత బందుకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

యువతకు,విద్యార్థులకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు

యువతకు,విద్యార్థులకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు

అధికారం కోసం వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అప్పుడప్పుడు బంపర్ ఆఫర్ లు ఇస్తాయి. మద్యం, డబ్బులు పంచితే… మరికొందరు వరాల జల్లు కురిపిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృశ్య కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తాజాగా యువతను, విద్యార్థులకు వరాలను కురిపించే విధంగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంటర్ పాసైన బాలికలకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్లు, డిగ్రీ విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...