34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 178

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటర్ తో మమేకం కావాలి- రేవంత్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటర్ తో మమేకం కావాలి- రేవంత్

హుజురాబాద్ ఉప ఎన్నికల ఇన్చార్జిలు సమన్వయకర్తల తో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థు లకు ప్రయోజనం కలిగించే అంశాలను వివరించాలని చెప్పారు అందులో భాగంగా
ఇంటింటికి కాంగ్రెస్కు ఓటే ఓటు వేసేలా ప్రచారం చేయాలని చెప్పారు ఇందుకోసం ప్రజలతో మమేకం కావాలని ఆయన అన్నారు. టిఆర్ఎస్, బిజెపిలమోసపూరిత విధానాలను, ఇచ్చిన వాగ్దానాలు, చేసిన నష్టాలు వివరించాలని అన్నారు ఉప ఎందుకొచ్చింది, కారణమేంటి అని ప్రజలను వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సాయశక్తులా కృషి చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు.

విద్యాశాఖలో పార్ట్ టైం, గెస్ట్ ప్రాథమిక టీచర్ పోస్టుల భర్తీ

విద్యాశాఖలో పార్ట్ టైం, గెస్ట్ ప్రాథమిక టీచర్ పోస్టుల భర్తీ
– 2021-2022 విద్యా సంవత్సరానికి టీచర్ పోస్టుల భర్తీ
– విద్యాశాఖలో పలు కేటగిరీల వారిగా ఉన్న 5323 ఖాళీల భర్తీ
విద్యాశాఖలోని పలు కేటగిరీల వారిగా ఉన్న 5323 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, మోడల్ స్కూల్స్ లకు 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ అ జిల్లాలోని ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కాంట్రాక్ట్, గంట ప్రాథమిక, పార్ట్ టైం, గెస్ట్ ప్రాథమిక టీచర్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ రూపకంగా భక్తి అయిన వారికి 1 సెప్టెంబర్ 2021 నుండి 30 ఏప్రిల్ 20 22 ఏడాది వరకు వారిని కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఆర్థిక శాఖ తన్నీరు హరీష్ రావు కిలో బంగారాన్ని ప్రకటించారు సిద్దిపేట నియోజకవర్గం ప్రజల తరఫున ఈ బంగారాన్ని అందిస్తామన్నారు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఆర్థిక శాఖ  మాత్యులు తన్నీరు హరీష్ రావు కిలో బంగారాన్ని ప్రకటించారు సిద్దిపేట నియోజకవర్గం ప్రజల తరఫున ఈ బంగారాన్ని అందిస్తామన్నారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ – ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం కడపలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ – ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం కడపలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలనుఅరెస్టు చేస్తున్న పోలీసులు

గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది . షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి . ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు . ప్రమాదం స్వల్పమైనదేనని అగ్నిమాపక అధికారులు తెలిపారు

జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి

జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుండి సిరివెళ్లకు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకులపై కారు పల్టీ కొడుతూ బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న, డి ఎస్ పి కే రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సమీప ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి :నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలో మంగళవారం రోజున మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,పట్టాభి ఇంటి పై వందలాది మంది రౌడీలు గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసు శాఖ,డిజిపి వైఫల్యం, నిఘా వైఫల్యం వల్లే ఇటువంటివి జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటివి ప్రోత్సహిస్తే ప్రజల్లో భయాందోళనకు జగన్మోహన్ రెడ్డి కారణం అవుతారని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

మార్చి 28న యాదాద్రి ఆలయ పున ప్రారంభం- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు – 125 కిలోల బంగారం తో స్వర్ణ తాపడం – 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం -సీఎం కేసీఆర్-

మార్చి 28న యాదాద్రి ఆలయ పున
ప్రారంభం

– జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు
– 125 కిలోల బంగారం తో స్వర్ణ
తాపడం
– 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం

సీఎం కేసీఆర్

వచ్చే ఏడాది మార్చి 28న జీయర్ స్వామి నిర్ణయించిన మేరకు యాదాద్రి ఆలయ పున ప్రారంభించడానికి నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆయన మంగళవారం యాదాద్రి లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహా కుంభ సంప్రోక్షణ
నిర్వహించడానికి విద్వత్ సభ నిర్వహించినట్లు చెప్పారు. మహా కుంభ సుదర్శన యాగం ఒక వెయ్యి ఎనిమిది మంది రిత్విక్ లచే జరపనున్నట్లు తెలిపారు. మూడు జలాశయాల నీరు కలిసే చోట యాదాద్రి పుణ్యక్షేత్రం గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక శోభకు కు నిలయంగా మారనుందని చెప్పారు. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు తదితర పెద్దలు వస్తే బస చేసేందుకు ప్రత్యేక సూట్లు ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి ఎకరాలలో గెస్ట్ హౌస్ లు, ధర్మశాలల నిర్మాణానికి ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని ప్రముఖ ఆగమ వాస్తు పండితులనందరిని విచారించి ఈ కార్యక్రమాన్ని ని చేపట్టడం జరిగిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వలె యాదాద్రి ఆలయానికి విమానం గోపురం నిర్మించడానికి125 కిలోల బంగారు స్వర్ణ తపడం చేయించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకుటుంబం నుండే ఒక కిలో లో 16 తులాల బంగారం ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కిలో, ఆయన నియోజకవర్గంలో నుండి మరో కిలో, జీయర్ పీఠం నుండి కిలో, కావేరి సీడ్స్ కిలో, బంగారం ఇవ్వనున్నట్టు తెలిపారు. యాదాద్రికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే బంగారాన్ని ఆర్బీఐ నుండి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని, నియోజకవర్గాన్ని , ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. యాదాద్రి క్షేత్రం మాది అని భావన కలగడానికి 12769 గ్రామ పంచాయతీలను, 3609 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లు భాగస్వామ్యులను చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని నేను ఎప్పుడు చెప్తుంటాను అని అదే ముమ్మాటికి నిజం అని అన్నారు. ఈ సమావేశంలో స్పీకర్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , జగదీశ్ రెడ్డి, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.

కారెక్కిన మోత్కు

కారెక్కిన మోత్కు
సీనియర్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లి తనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మోత్కుపల్లికి ఎంతో రాజకీయ అనుభవం ఉందని, తనతో కలిసి పలు శాఖల్లో పని చేశామని అన్నారు. టిడిపి హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ కోతలు ఎలా వుండేవో తెలిసిన వాడన్నారు. నీళ్ల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు ఆయనకు తెలియంది కాదన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కే కేశవరావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

టిఆర్ఎస్ లో గరం గరం కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం

టిఆర్ఎస్ లో గరం గరం
కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం

-హుజురాబాద్ ఎన్నికలే ఆలస్యం తదుపరి టిఆర్ఎస్ల్ లో ముసలం పుడుతుందని, కారులో తిరుగుబాటు మొదలవుతుందని టిపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు
అందుకోసమే ప్లీనరీలో గర్జనలు పెడుతుందని అన్నారు. ఈటెల రాజేందర్ ను బయటకు పంపి నట్టే మంత్రి హరీష్ రావును కూడా బయటకు పంపేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ పథకాన్ని రచించారని అన్నారు. త్వరలోనే హరీష్ రావు ను
కలిసి ఉంటానని అని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత హరీష్ కు అడుగు అడుగునా అగ్నిపరీక్షే నని అందుకు సిద్ధం కావాలని సూచించారు. ఈటెల రాజేందర్ ఓడిపోయిన గెలిచినా ఎవరికీ లాభం లేదని, ఇది ముందుగానే అందరూ ఊహించిందేనని అన్నారు. ముందస్తుకు వెళ్లనని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
గుజరాత్తోనే తెలంగాణా లో ఎన్నికలు వస్తాయని చెప్పారు. మోడీ సూచనల మేరకే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళను న్నాడని రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే పథకం నడుస్తుందని అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అని మరోమారు ఋజువైంది, దళిత ద్రోహి నాయకత్వంలోనే మరో దళిత నాయకుడు చేరాడాని మోత్కుపల్లి నర్సింహులు ఉద్దేశించి అన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...