23.9 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 179

టిఆర్ఎస్ లో గరం గరం కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం

టిఆర్ఎస్ లో గరం గరం
కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం

-హుజురాబాద్ ఎన్నికలే ఆలస్యం తదుపరి టిఆర్ఎస్ల్ లో ముసలం పుడుతుందని, కారులో తిరుగుబాటు మొదలవుతుందని టిపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు
అందుకోసమే ప్లీనరీలో గర్జనలు పెడుతుందని అన్నారు. ఈటెల రాజేందర్ ను బయటకు పంపి నట్టే మంత్రి హరీష్ రావును కూడా బయటకు పంపేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ పథకాన్ని రచించారని అన్నారు. త్వరలోనే హరీష్ రావు ను
కలిసి ఉంటానని అని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత హరీష్ కు అడుగు అడుగునా అగ్నిపరీక్షే నని అందుకు సిద్ధం కావాలని సూచించారు. ఈటెల రాజేందర్ ఓడిపోయిన గెలిచినా ఎవరికీ లాభం లేదని, ఇది ముందుగానే అందరూ ఊహించిందేనని అన్నారు. ముందస్తుకు వెళ్లనని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
గుజరాత్తోనే తెలంగాణా లో ఎన్నికలు వస్తాయని చెప్పారు. మోడీ సూచనల మేరకే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళను న్నాడని రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే పథకం నడుస్తుందని అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అని మరోమారు ఋజువైంది, దళిత ద్రోహి నాయకత్వంలోనే మరో దళిత నాయకుడు చేరాడాని మోత్కుపల్లి నర్సింహులు ఉద్దేశించి అన్నారు.

హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం

హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రానున్న శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి సిపిఐ పార్టీ పోరుకు సిద్ధపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.సోమవారం నాడు హుస్నాబాద్ లోని స్థానిక అణభేరి,సింగిరెడ్డి అమరుల భవన్ లో జరిగిన సిపిఐ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరై సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ గత ఏడు సంవత్సరాల్లో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని. రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి సిపిఐ పార్టీగా బరిలో ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్, సిద్దిపేట,కరీంనగర్ జిల్లా కార్యదర్శులు మంద పవన్,పోనగంటి కేదారి,హన్మకొండ జిల్లా సహాయ కార్యదర్శి,కర్రె భిక్షపతి,ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశ్,బోయిని అశోక్,వెల్పుల బాలమల్లు, యెడల వనేశ్, బత్తుల బాబు, కనుకుంట్ల శంకర్,కనుమాల ప్రతాప్ రెడ్డి,జేరిపోతుల జనార్ధన్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బైరగోని శంకర్, మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు యాద పద్మ,మాలోతు ఉమా,శనిగరం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఆదరించి జగన్ రుణం తీర్చుకోండి

ఆదరించి జగన్ రుణం తీర్చుకోండి
-బద్వేలు లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కోసం డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ ప్రచారం
అందరూ తప్పకుండా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవాలని డెప్యూటీ సీఎం అంజాద్ బాషా కోరారు. ఆయన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గము లో అభ్యర్థి దాసరి సుధ తో ప్రచారం లో పాల్గొన్నారు. మనకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలిచే అవకాశం ఉపఎన్నికల ద్వారా వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నారు. మునిసిపల్ వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అందరూ తప్పకుండా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవాలి.. బద్వేల్ కు మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.. ఎంత కరవు పరిస్థితులు వున్నా నీళ్లు అందేలా చేశారని, సాగునీరు కోసం బ్రహ్మసాగర్ నుంచి కాలువలు నిర్మిస్తున్నారన్నారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లాలో ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం

జనగామ జిల్లాలో
ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం
-డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం
– షార్ట్ సర్క్యూట్ కావడంతో జరిగిన ప్రమాదం
-జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ఘటన
-ప్రమాద సమయంలో బస్సు లో 26 మంది ప్రయాణికులు
-చత్తిస్ ఘడ్ నుంచి హైద్రాబాద్ కు వస్తుండగా ప్రమాదం

చత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వస్తున్న సెమీ లగ్జరీ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. సేమీ లగ్జరీ బస్సు చత్తీస్గడ్ నుండి వస్తున్న క్రమంలో జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద కు రాగానే బస్సు బస్సు కింద నుండి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించి బస్సును పక్కకు ఆపివేశారు. ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే దింపేశారు. బస్సు ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ చాకచక్యాన్ని పలువురు అభినందించారు

రేపు సెలవు

మిలాద్ ఉన్ నబి సందర్బంగా ఈ నెల 19న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మొహ్మద్ ప్రవక్త జన్మ దినం సందర్బంగా మిలాద్ ఉన్ నబి నిర్వహిస్తారు.

ముదిరాజ్ శతజయంతి ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘాన్ని కృష్ణ స్వామి ముదిరాజ్. స్థాపించి వంద సంవత్సరాలు నిండినది. అందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం రోజున దుబ్బాక వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఎగరవేయడం జరిగింది. ముదిరాజులు రాష్ట్ర జనాభాలో ముదిరాజుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ముదిరాజులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల పై కరుణించి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని దుబ్బాక మండల అధ్యక్షుడు మాడబోయిన రాజు పేర్కొన్నారు

హైదరాబాద్ ను మరోమారు వర్షం ముంచెత్తింది

హైదరాబాద్ ను మరోమారు వర్షం ముంచెత్తింది.

శనివారం కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దసర పండగకు ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. వర్షం భారీగా కురుస్తుండడం తో ప్రజలు అవస్థ పడ్డారు. అంబేర్పెట్, మాలక్పేట్, తిలక్నగర్ తదితర ప్రాంతాల వారు ఎక్కువగా ఇబ్బందులకు లోనయ్యారు.

మహారాష్ట్రలోను బ్రతుకమ్మ

మహారాష్ట్రలోను బ్రతుకమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలో తెలంగా సంస్కృతిలో భాగమైన బ్రతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ముక్యంగా పాత విదర్భ ప్రాంతంలో ఈ సంస్కృతి కనపడుతుంది. రాష్ట్రం మారినా తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తున్నారు ప్రజలు. బ్రతుకమ్మల చుట్టూ లయబధంగా ఆడి పడ్డారు. వెంట తెచ్చుకున్న సద్దులను పంచుకొని తిన్నారు. మాహారాష్ట్రలోని భీమండి, జాల్నా, తదితర ప్రాంతాల్లో పండగను సంబరంగా జరుపుకున్నారు.

పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది | వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం

పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది – డిప్యూటీ సీఎం మహమూద్ అలీ – వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందని డిప్యూటీ సీఎం ఎం, హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో రూపాయలు 23 కోట్లతో పోలీసుల కోసం నిర్మించిన బారక్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ బ్యారక్లో 450 మంది పోలీసు అధికారుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడినది చెప్పారు తెలిపారు. డైనింగ్ హాల్, బెడ్ తదితర అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జపాన్ లాంటి దేశాల వలె తెలంగాణ పోలీసు శాఖ మెరుగుపరుచుకున్నదని చెప్పారు. గతంలో పోలీస్ స్టేషన్కు రావాలంటే భయ పడేవారని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. పోలీసుల కోసం అత్యాధునిక అందమైన భవనాలు పోలీసుల కోసం నిద్రింప చేస్తున్నాడని అన్నారు. వెంట రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సి పి జోయల్ డేవిస్, పోలీస్ హౌసింగ్, అటవీ శాఖ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దసరా సంబారాలు | కోటి లింగాల ఆలయం సిద్ధిపేట

సిద్దిపేటలో దసరా వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట కోటి లింగేశ్వర స్వామి క్షేత్రం లో ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో శమీ వృక్షానికి పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు ఆలయ ప్రధాన వైదికులు దసరా పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. అందరికీ శమి వృక్షం అనగా మహాభారత కాలంలో అర్జునుడు ఆయుధాలు దాచిందే ఎక్కువగా తెలుసునని, కానీ శమి వృక్షం అనగా అగ్నికి చిహ్నమని, విజయానికి గుర్తు అని చెప్పారు. కాగా నర్సాపూర్, రంగాధంపల్లీలో కూడా వేడుకలు జరిగాయి

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...