34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025

కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు

కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు

విజయవాడ, యదార్థవాది ప్రతినిధి: యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ నుంచి ఈ ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం పేర్కొన్నారు. ఇక ఈ యాత్రలో ప్ర‌యాగ‌రాజ్‌ తో పాటు వార‌ణాసి, అయోధ్య పుణ్య‌ క్షేత్రాల‌ను ద‌ర్శించు కునేలా రానుపోను దాదాపు 3,600 కిలోమీట‌ర్లు, మొత్తం 8 రోజుల యాత్ర‌ను ప్లాన్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు యాత్రను షెడ్యూల్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం విజ‌య‌వాడ పీఎన్‌బీఎస్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.2వ తేదీన సాయంత్రం ప్ర‌యాగ‌రాజ్‌కు చేరుకుంటాయి. 3వ తేదీన ప్ర‌యాగ‌రాజ్‌లోనే బ‌స చేయ‌డం జ‌రుగుతుంది. 4న రాత్రి నుంచి అయోధ్య‌కు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. 5న ఉద‌యం అయోధ్య‌కు చేరుకుని, బాల రాముడి ద‌ర్శ‌నం అనంతరం రాత్రికి కాశీకి ప్రయాణం, 6వ తేదీన వార‌ణాసికి చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స ఉంటుంది. 7న ఉద‌యం వార‌ణాసి నుంచి బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి. 8న బ‌స్సులు విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయని తెలిపారు.

*యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఛార్జీలు ఇలా..

సూప‌ర్ ల‌గ్జ‌రీ- రూ.8వేలు, స్టార్ లైన‌ర్ నాన్ ఏసీ స్లీప‌ర్‌- రూ.11వేలు, వెన్నెల ఏసీ స్లీప‌ర్‌- రూ.14,500, ఈ యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఛార్జీలు పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఒకేలా ఉంటాయ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. అలాగే త‌మ‌కు ఇచ్చేది కేవ‌లం బ‌స్సు ఛార్జీలు మాత్ర‌మేన‌ని తెలిపారు. భోజ‌నం, వ‌స‌తి, ఇత‌ర ఖ‌ర్చుల‌ను ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక యాత్రకు వెళ్ల‌ద‌ల‌చిన వారు 35, 29 మంది భ‌క్తులు స‌మూహంగా వ‌స్తే ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అలాగే ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం ఆన్‌లైన్‌, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లు, స‌మీప బస్ స్టేష‌న్ల‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 8074298487, 0866 2523926, 0866 2523928 నంబ‌ర్ల‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపారు. కాగా, ఇప్ప‌టికే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కొవ్వూరు నుంచి బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. వాటిల్లో రిజ‌ర్వేష‌న్లు కూడా పూర్తయిన‌ట్లు పేర్కొన్నారు. ఇవి కూడా ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచే బ‌య‌ల్దేరుతాయ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు.

మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగు లోకి నీటి విడుదల

మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగు లోకి నీటి విడుదల

– ఎమ్మెల్యే విజ్ఞప్తి కి స్పందించిన మంత్రి

– మంత్రి ఉత్తమ్ కుమార్ కు ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే 

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28: కూడవెల్లి వాగు లోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తి కి స్పందించారు. మంగళవారం మంత్రిని కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి పంట పొలాలు ఎండిపోతున్నాయని, కూడవెల్లి జాతర సందర్బంగా వాగు నీళ్లు లేక వట్టి పోయిందని, కూడవెల్లి వాగుతో పాటు రామాయంపేట, చిన్న శంకరంపేట కాలువలలోకి మల్లన్న సాగర్ జలాలు విడిచి దుబ్బాక నియోజకవర్గం లోని రైతుల పంట పొలాలు కాపాడాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి కి స్పందించిన మంత్రివర్యులు వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగులోకి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. వాగు ప్రవహిస్తున్నందున వాగు పరివాహక రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తాను చేసిన విజ్ఞప్తి కి స్పందించి నీటి విడుదల చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిన్న శంకరంపేట, రామాయంపేట కాలువలకు నీటిని విడుదల చేయాలని, చిన్న కాలువలను పూర్తి చేయాలని కోరారు.

మండల ప్రజా పరిషత్ కార్యాలయం కొరకు భవనం పరిశీలించిన అధికారులు

మండల ప్రజా పరిషత్ కార్యాలయం కొరకు భవనం పరిశీలించిన అధికారులు 

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయం కొరకు తాహిసిల్దార్ కార్యాలయము వెనకాల ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించిన అధికారులు నాయకులు. ఈ భవనంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని ఇక్కడ తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కూడా దగ్గరగా ఉన్నాయని ప్రజలకు రవాణా పరంగా కూడా అణువుగా ఉంటుందని దీనిలోనే మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకు వివరించిన స్థానిక నాయకులు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి, దుబ్బాక ఎంపీడీవోలు గణేష్, భాస్కర్ శర్మ, అక్బర్ పేట మాజీ సర్పంచ్ బుచ్చయ్య, భూంపల్లి ఎంపిటిసి అబ్బుల ఉమారాణి బాల గౌడ్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, కూతురి కుమార్, పోతారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, జంగం నాగరాజు, దేవుని భూమయ్య, పంచాయతీ సెక్రెటరీ అశోక్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వాసవి మాత దేవాలయంలో సామూహిక కుంకుమార్చన

ఘనంగా వాసవి మాత దేవాలయంలో సామూహిక కుంకుమార్చన

సూర్యాపేట, యదార్థవాది  ప్రతినిధి, జనవరి 28: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలను పురస్కరించుకొని 2వరోజు మంగళవారం సామూహికంగా మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం ఘఘనంగానిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు120  మంది  మహిళలు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, వాసవి మాలాధారణ నిర్వాహకులు పబ్బతి వేణుమాధవ్, కల కోట లక్ష్మయ్య మాట్లాడుతూ  ఈనెల 31న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని ఐదు రోజులపాటు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ రోజు కుంకుమార్చనలు, వాసవి మాత పారాయణం, లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. నేడు బుధవారం 102 కలశములతో మాలధారణ స్వాములతో శోభాయాత్ర నిర్వహించి శ్రీ వాసవి మాతకు మహా అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30న  పెద్ద ఎత్తున సాయంత్రం శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు. భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకుని తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్, తోట శ్యాంప్రసాద్, పోలా రాధాకృష్ణ, వెంపటి శబరినాథ్, ఈగ దయాకర్, బిక్కుమల్ల కృష్ణ, నూక రవిశంకర్, మంచాల శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, గుండా శ్రీధర్, రాచర్ల కమలాకర్, తోట రమేష్, మీలా వంశీ, బజ్జూర్ శ్రీనివాస్, డోగుపర్తి ప్రవీణ్, గుమ్మడవెల్లి శ్యామ్, యామ సంతోష్, వంగవీటి రమేష్, సింగరకొండ ప్రదీప్ కుమార్, ఉప్పలంచు కృష్ణ, చిలుకల స్వాతి శ్రీనివాస్, సింగిరికొండ కరుణశ్రీ, దేవరశెట్టి ఉమారాణి, తెడ్లపల్లవి, లకుమారపు పద్మ, తెడ్ల రాధిక, పోలా సుధామని, కలకోట అనిత, తేడ్ల పల్లవి, ఉప్పలంచు హైమావతి తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలి

బండి సంజయ్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28:

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఇందిరా గాంధీ, గద్దర్ పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఖబర్దార్ అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, తాజా మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో నీటికిచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటి పిలుపుతో మంగళవారం జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి  ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్  సూచనలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు, పోటోతో ఇందిరమ్మ సంక్షే పథకాలను పేద ప్రజలకు అందిస్తుంటే బిజెపి నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రజా యుద్ద నౌక గద్దర్ పట్ల ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదని ఇలాంటి వాఖ్యలు పునరావృతమైతే బయట తిరగనివ్వమని ఖబర్దార్ అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో సంక్షేమ పథకాలు పెడితే తప్పెమువందని ప్రశ్నించారు. మావోయిస్టులకు ఎంపి, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే తప్పు లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు గద్దర్ పేరును ప్రదిపాదిస్తే తప్పు వచ్చిందా అని చెప్పారు. పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా బిజెపి పార్టీ ఇస్తుందో బండి సంజయ్ సమాదానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ చరిత్రపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో  యూత్ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ ను బయట తిరగనివ్వరన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నియోజకవర్గ అధ్యక్షులు జావిద్ బేగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, నాయకులు నాగుల వాసు, రుద్రంగి రవి, శబరి, పందిరి మల్లేష్, సాజిద్, శివ, నాని,సమీర్,నరేష్, అనిల్, సుదీర్, నాగారజు, మణికంఠ, రాపర్తి శ్రీనివాస్, సమీర్, వీరయ్య పాల్గొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ 

రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ 

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్లగొండలో జరిగే రైతు మహాధర్నా కు తరలి వెళ్లే వాహనాలను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. రైతు భరోసా ఎకరానికి 15000, ఇస్తానని చెప్పి కేవలం 12 వేలకే పరిమితమైందని కౌలు రైతులను గుర్తించకపోవడం దారుణం అన్నారు .కృష్ణా జలాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి  టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రైతు మహా ధర్నా కు ప్రజలంతా మద్దతిస్తున్నారని తెలిపారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో లతీఫ్ సందీప్, కళ్యాణ్, ధర్మపురం గ్రామమాజీ సర్పంచ్ నెమ్మది నగేష్, వేణు ,కక్కిరేణి వెంకటేష్, కార్తీక్ ,నున్న యాదగిరి, దొంగరి లింగస్వామి, రాజశేఖర్,సైదులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి బండి చిత్రపటానికి పాలాభిషేకం

కేంద్ర మంత్రి బండి చిత్రపటానికి పాలాభిషేకం

హుస్నాబాద్, యదార్ధవాది ప్రతినిధి, జనవరి 28: హుస్నాబాద్ నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధుల నుండి మూడు కోట్ల 30 లక్షలు రూపాయలను మంజూరు చేయించిన కేంద్రమంత్రి బండి సంజయ్ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ కోహెడ మండల మాజీ అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం ఆద్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈసందర్భగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అక్కన్నపేట కు 50 లక్షలు హుస్నాబాద్ 10 లక్షలు బెజ్జంకి 50  లక్షలు కాగ  సూచన మేరకు కోహెడ మండలానికి 27 గ్రామాలకు ఎంపీ బండి సంజయ్ కృషితో రెండు కోట్ల 20 లక్షల నిధులను సిమెంట్ రోడ్లు డ్రైనేజీల కోసం మంజూరు చేయించుకోవడం జరిగిందని, గత ప్రభుత్వం ప్రొసీడింగ్ రానీయకుండా చాలాసార్లు అడ్డు తగిలినపప్పటికి పట్టుదలతో కేంద్ర మంత్రి సంజయ్ కు కోహెడ మండలంలోని 27 గ్రామాలకు ఈజిఎస్ స్పెషల్ గ్రాంట్స్ క్రింద సిసిరోడ్లు మంజూరు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కోహెడ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ మ్యాకల చెంద్రశేఖర్ రెడ్డి, ద్యాగాటీ సురేందర్, మ్యాకల రజినీకాంత్ రెడ్డి, చేను తిరుపతి,బొమ్మగాని శివకుమార్,అన్నడి లక్ష్మ రెడ్డి, చిగురు రాజిరెడ్డి,నరాల శ్రీకాంత్, అన్నడి మధుసుధన్ రెడ్డి, ఏడుమల రాజు,జాలిగాం సంపత్,నాగు అజయ్,గంగాడి అనిల్ రెడ్డి,ఖమ్మం రాజు,తుపాకుల లక్ష్మణ్, శాతవేణి హరీష్, పుట్ట లక్ష్మణ్, శ్రావణపల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల కోసమే ప్రజా ప్రభుత్వం 

రైతుల కోసమే ప్రజా ప్రభుత్వం 

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28 : కాంగ్రెస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో తను రైతుల కోసం చేస్తానన్న రైతు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ రైతు భరోసా పథకాలను పేద బడుగు బలహీన వర్గాల రైతులకు భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతు సోదరులకు అందించడం ఎంతో సంతోషకరమైన విషయం గణతంత్ర దినోత్సవం రోజు  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  రైతు భరోసా కింద తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక్క రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకొని పైలెట్ ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిగా సాగు చేసే భూములకు రైతు భరోసా అందిస్తూ అలాగే ఇందిరమ్మ రైతు భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలని నిజమైన జవాబుదారులను చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇంతటి గొప్ప పథకాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఇచ్చిన గ్యారంటీ లన్నీ పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అనంతులశ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మండల పార్టీ అధ్యక్షులు కొంగరి రవి ఆకుల భరత్ మల్లు రామచంద్రారెడ్డి దుబ్బాక పరశరాములు ఐరేని సాయి సత్తు శ్రీనివాసరెడ్డి అనంతుల రాజు మిద్దె  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టి హెచ్ ఆర్ అడ్వాన్స్ గిఫ్ట్…!! 

టి హెచ్ ఆర్ అడ్వాన్స్ గిఫ్ట్…!! 

-పది విద్యార్థుల కు కెసిఆర్ డిజిటల్ కేంటెంట్ 

-సాంకేతిక పరిజ్ఞానం తో మేధస్సు కు పదును

-స్కూల్ లో స్పెషల్ స్టడీ, ఇక ఇంట్లో  డిజిటల్ స్టడీ..

-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాగ సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శం గా నిలుస్తుంది.. అదే స్ఫూర్తి తో విద్యారంగం లో అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచింది.. నేటి యువతరం డిజిటల్ , మొబైల్ వైపు విశృంఖలంగ విస్తరిస్తోంది.. ఆదిశగా మాజీ మంత్రి హరీష్ రావు గత సంవత్సరం ఫలితాలను రెట్టింపు  వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత సంవత్సరం నుండి డిజిటల్ కంటెంట్ రూపం లో జిల్లా లోని పదవ తరగతి విద్యార్థుల కు బుక్స్ పంపిణి చేశారు. అదే స్ఫూర్తి తో ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం లోని పదవ తరగతి విద్యార్థుల కు హరీష్ రావు ఇవ్వనున్నారు. ఒక వైపు ఉత్తరం మరో వైపు పాఠశాల లో ప్రత్యేక తరగతులు వీటితో పాటు సరికొత్త కార్యక్రమానికి హరీష్ స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక తరగతులతో పాఠశాల లో చదువుతే.. ఇంట్లో ఉండి చదివేల వారి మేధస్సు ఇంక పదును పడేలా ”  డీజిటల్ స్టడీ ” అనే వినూత్న కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు . త్వరలో నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో చదివే 2500 మంది విద్యార్థుల కు అందజేయనున్నారు. సిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గత ఐదు సంవత్సారాలుగా రాష్ట్రంలో నే అగ్రస్థానం లో  నిలిచింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానం లో నిలిచేల గత నెల  నుండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసారు. విద్యార్థుల తల్లీ తండ్రులకు నేరుగా ఉత్తరం వ్రాయడం  తో పాటు వారి ని ఇంటి వద్ద చదివించెల తల్లి తండ్రుల్లో మరియు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేల కాన్ఫరెన్స్  కూడా నిర్వహించారు.

” కెసిఆర్ డిజిటల్ కంటెంట్.. టి హెచ్ ఆర్ గిఫ్ట్ “..

– డిజిటల్ కంటెంట్ గత రెండు సంవత్సరాల మెరుగైన ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా డిజిటల్ కేంటెంట్ ఇచ్చి వారు స్కూల్ నుండి వెళ్ళాక ఇంట్లో కూడా అర్థం కానీ పాఠాలు చదివేల హరీష్ రావు  ఈ కార్యక్రమం చేపట్టారు. గత రెండు సంవత్సరాలనుండి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.. కెసిఆర్ డిజిటల్ కేంటెంట్… టి హెచ్ ఆర్ గిఫ్ట్ తో… పది విద్యార్థుల కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అడ్వాన్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  సాయంత్రం  ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.. కొద్దీ రోజుల్లోనే ఆల్ఫాహారం ప్రారంభం కానుంది. అదే పంథాలో వారిలో మరింత మేధస్సు పదును పెట్టాలి పదవ తరగతి వారి భవితకు ఎంతో పునాది అని ఆ దిశగా పై చదవులకు ఈ పదవ తరగతి స్పూర్తి కావాలని వారు పాఠశాల లోనే కాదు ఇంటి వద్ద కూడా చదువు కొనే ఒక కొత్త కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపారు. 

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు నాలుగు కిలోమీటర్ల మేర మహా కరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షుడు ధ్యాన గద్దర్ భూపతి రాజు తెలిపారు. అనంతరం తాడూరి బాలా గౌడ్  ఫంక్షన్ హాల్ లో  జరిగే ధ్యాన మహాసభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే  తన్నీరు హరీష్ రావు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమాల్లో సుమారు 2000 మంది ధ్యానులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడుఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు వీరేశం, బాలయ్య, సభ్యులు రామచంద్రం రెడ్డి, వెంకటేశo తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...