ఉద్యోగ భద్రత కల్పించండి
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
రాష్వ్య్రాప్తంగా ఉన్న ఈ పంచాయతీ ప్రాజెక్ట్ మేనేజర్ల కు, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు పేస్కెల్, ఉద్యగ భద్రత కల్పించాలని సిద్దిపేట జిల్లా పంచాయతీ సంఘం అధ్యక్షుడు నవీన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నామని అలాంటి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని. వెంటనే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ప్రక్కన శాంతి యుత సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ పంచాయతీ వ్యవస్థలో 13 సంత్సరాలుగా పనీ చేస్తున్న 33మంది డి.పి. ఎం.లకు పెస్కేల్ ను అమలు చేయాలి అని అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లు గా విధులు నిర్వర్తిస్తున్న 1619 మంది కి ఉద్యోగ భద్రత, జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ పే స్కేల్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గ్రామ పంచయతీ లలో అకౌంట్ లు, జనన,మరణ ధృవ పత్రాలను మంజూరీ చేయుట.ఇంటి పన్నులు అంతర్జాలం లో పొందుపరచుట , ఇంటి నిర్మాణాల అనుమతి, లే అవుట్ ల అనుమతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయ వంతం కావడానికి ఈ పంచాయతీ ఆపరేటర్ లుగా కీలక పాత్ర పోషించా మని అలాంటి మా న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించా లని అన్నారు.. ఈ కార్యక్రమం లో ఈ పంచాయతీ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి బి. నర్సింలు, గౌరవ అధ్యక్షులు మంద లక్ష్మన్, కోషాధి కారి సంతోష్ కుమార్, మహిళ నాయకులు శాలిక, సుమలత, సాగర్, బాలకృష్ణ రెడ్డి, నర్సింలు, మహేష్, స్వామి, నవీన్ కుమార్, చౌడ లక్ష్మన్, సంపత్, బాలరాజు, మన్నన్, శ్రావణ్, సంపత్, ఏళ్లం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.